బంగారం ధరలు రికార్డ్-హై..!!

- October 07, 2025 , by Maagulf
బంగారం ధరలు రికార్డ్-హై..!!

యూఏఈ: షార్జా ఎక్స్‌ పోలో వాచ్ అండ్ జ్యువెలరీ మిడిల్ ఈస్ట్ షో.. విజిటర్స్, డీలర్లు మరియు రిటైలర్లను ఆకర్షిస్తుంది.  బ్రాండ్‌ లను పెంచుకోవడానికి, క్లయింట్‌లతో కనెక్ట్ అవ్వడానికి అనేక అవకాశాలను అందిస్తుంది. మరోవైపు వడ్డీ రేట్లు తగ్గుతూ, ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉండటంతో యూఏఈ, ఇతర GCC దేశాలలోని కొందరు నివాసితులు తమ నగదును బంగారంలోకి తరలిస్తున్నారు.  

ద్రవ్యోల్బణం తమ నగదు నిల్వల విలువను తగ్గిస్తుందనే ఆందోళనలతో యూఏఈలోని వ్యాపారులు తమ పొదుపులను బంగారంగా మార్చుకునే ధోరణి పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.  బంగారం ధరలు పెరుగుతున్నాయని, ప్రజలు దీనిని సురక్షితమైన మరియు  పెట్టుబడిగా చూస్తారని అల్ రోమైజాన్ మార్కెటింగ్ డైరెక్టర్ మొహమ్మద్ ధైబాన్ తెలిపారు. ఇన్వెస్టర్లు తమ పొదుపులను నగదు రూపంలో ఉంచుకోవడం కంటే, విలువ కోల్పోయే అవకాశం ఉన్నందున, వారు బంగారం, ఇతర ఆభరణాలలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతారని తెలిపారు.

కొంతమంది ఆర్థికవేత్తలు బంగారం ధర ఔన్సుకు $5,000కి చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. అందుకే ప్రజలు ఇప్పుడే బంగారం కొనడం మంచిదని భావిస్తున్నారు.  యూఏఈ, సౌదీఅ అరేబియా అంతటా బంగారానికి అధిక డిమాండ్ ఉందని స్కోప్ మార్కెట్స్ సీఈఓ పావెల్ స్పిరిన్ పేర్కొన్నారు.   

యూఏఈలో బంగారం ధరలు ఆల్ టైమ్ హైకి చేరాయి.  24K బంగారం ధర గ్రాముకు Dh475.25, 22K బంగారం ధర గ్రాముకు Dh440 వద్ద ఉంది. బంగారం ధరలు ఏటా 5 నుండి 7 శాతం వరకు పెరిగేవి.  కానీ ఇటీవలి సంవత్సరాలలో ముఖ్యంగా కోవిడ్-19 మహమ్మారి నుండి భారీగా పెరుగుతుందని పలువురు బంగారం వ్యాపారులు వెల్లడించారు. 

 

  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com