కస్టమ్స్ యాప్ ద్వారా కార్లు, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్ వేలం..!!
- October 07, 2025
దోహా: ఖతార్ లోని జనరల్ అథారిటీ ఆఫ్ కస్టమ్స్ తన తాజా ఆన్‌లైన్ వేలం వివరాలను ప్రకటించింది. ఈ పబ్లిక్ వేలాన్ని “మజాద్ అల్ జోమ్రోక్” యాప్ ద్వారా నిర్వహించనున్నట్లు తెలిపారు.
అక్టోబర్ 14–15వ లేదీల్లో వేలం జరుగుతుందన్నారు. వేలంలో వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, గృహోపకరణాలు, క్రీడా పరికరాలు, పురాతన సేకరణలు మరియు కంటైనర్‌లతో సహా 160 కంటే ఎక్కువ రకాల వస్తువులు ఉంటాయని పేర్కొంది. ఇవి కొనుగోలుదారులకు విభిన్నమైన ప్రత్యేకమైన, విలువైన వస్తువులను అందిస్తాయని తెలిపింది.
ఆసక్తిగల పాల్గొనేవారు యాప్ ద్వారా లేదా నిర్దేశిత సమయాల్లో కస్టమ్స్ వేర్‌హౌస్ (ఇండస్ట్రియల్ ఏరియా)ని సందర్శించడం ద్వారా వస్తువులను ముందుగానే ప్రివ్యూ చేయవచ్చని తెలిపారు. అక్టోబర్ 5 నుండి 15వరకు ఉదయం 8 నుండి 11 గంటల మధ్య వేలంలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఎస్ఎస్ఆర్ హోటల్స్ కు స్వచ్ఛ ఆంధ్రా అవార్డు..!!
- జ్లీబ్ సమస్యకు వర్కర్స్ సిటీస్ తో చెక్..!!
- BD7,000 విలువైన గోల్డ్ జివెల్లరీ చోరీ..మహిళ అరెస్టు..!!
- కస్టమ్స్ యాప్ ద్వారా కార్లు, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్ వేలం..!!
- జీసీసీ-ఈయూ మధ్య భాగస్వామ్యం బలోపేతం..!!
- బంగారం ధరలు రికార్డ్-హై..!!
- బెలారస్ –ఒమన్ మధ్య పలు ఒప్పందాలు..!!
- మేధోమథనంతో మరింత మెరుగైన సేవలు: సీఎం చంద్రబాబు
- మరో రూ.9 వేల కోట్ల పెట్టుబడులు..
- ట్రక్కుల పై 25 శాతం టారీఫ్‌లు విధించిన ట్రంప్