ఖతార్ లోని అల్ బలాదియా జంక్షన్ మూసివేత..!!

- October 08, 2025 , by Maagulf
ఖతార్ లోని అల్ బలాదియా జంక్షన్ మూసివేత..!!

దోహా: ఖతార్ లోని అల్ బలాదియా జంక్షన్ ను తాత్కాలికంగా మూసివేయనున్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ రహదారుల్లో వెళ్లాలని పబ్లిక్ వర్క్స్ అథారిటీ అష్ఘల్ ప్రకటించింది. అల్ బలాదియా జంక్షన్ నాలుగు దిశలలో అన్ని రహదారులను పూర్తిగా మూసివేస్తున్నట్లు తెలిపింది.

రోడ్డు మార్కింగ్ పనులు నిర్వహించడానికి అక్టోబర్ 12న అర్ధరాత్రి 12 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు అంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది. వాహనదారులు నిర్దేశించిన మళ్లింపు మార్గాలలో తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని అష్ఘల్ కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com