అల్ సలీల్ నేచురల్ పార్క్ రిజర్వ్ అభివృద్ధికి ఒప్పందం..!!
- October 08, 2025
మస్కట్: సౌత్ అషర్కియా గవర్నరేట్‌లోని అల్ కమిల్ వాల్ వాఫీలోని విలాయత్‌లో అల్ సలీల్ నేచురల్ పార్క్ రిజర్వ్ ను అభివృద్ధి చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఒమన్ LNG కంపెనీ మరియు ఒమన్ ఇండియా ఫెర్టిలైజర్ కంపెనీ (OMIFCO) లతో ఎన్విరాన్మెంట్ అథారిటీ ఒప్పందం చేసుకుంది. దీని మొత్తం వ్యయం OMR2.6 మిలియన్లు. ఈ ఒప్పందంపై ఎన్విరాన్మెంట్ అథారిటీ చైర్మన్ డాక్టర్ అబ్దుల్లా అలీ అల్ అమ్రి, ఒమన్ LNG డెవలప్మెంట్ ఫౌండేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ అమెర్ నాసర్ అల్ ముతాని సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో సౌత్ అషర్కియా గవర్నర్ డాక్టర్ యాహ్యా బదర్ అల్ మావాలి పాల్గొన్నారు.
అల్ సలీల్ నేచురల్ పార్క్ రిజర్వ్‌ను పర్యావరణ పర్యాటక గమ్యస్థానంగా మార్చడం ఈ ఒప్పందం లక్ష్యమని సౌత్ అషర్కియా పర్యావరణ విభాగం డైరెక్టర్ నాజర్ సలీమ్ అల్ అరైమి తెలిపారు. ఇది సహజ వారసత్వాన్ని కాపాడుకోవడం, స్థిరమైన ఆర్థిక అభివృద్ధిని సాధించడం మధ్య సమతుల్యతను కలిగి ఉంటుందన్నారు. ఈ ప్రాజెక్ట్ సహజ ఆవాసాల పరిరక్షణ, వన్యప్రాణులు మరియు వృక్షసంపద, ముఖ్యంగా అంతరించిపోతున్న జాతుల రక్షణతో సహా అనేక ప్రయోజనాలను అందిస్తుందని తెలిపారు. ఇది గవర్నరేట్‌లో పర్యాటక రంగాన్ని మరింత డెవలప్ చేస్తుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్‌లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







