బహ్రెయిన్-సౌదీ సంబంధాలు చారిత్రాత్మకం..!!
- October 08, 2025
మనామా: బహ్రెయిన్, సౌదీ అరేబియా మధ్య దీర్ఘకాల చారిత్రక సంబంధాలు, సోదర బంధం ఉందని బహ్రెయిన్ కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా వెల్లడించారు. అల్-సఫ్రియా ప్యాలెస్‌లో సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి, రాయల్ హైనెస్ ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ బిన్ అబ్దుల్లా అల్ సౌద్ మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఆయన బహ్రెయిన్-సౌదీ సమన్వయ మండలి కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో పాల్గొనడానికి బహ్రెయిన్ కు వచ్చారు. అంతకుముందు సౌదీ విదేశాంగ మంత్రికి కింగ్ హమద్ సాదర స్వాగతం పలికారు.
ప్రస్తుత ప్రాంతీయ సవాళ్ల నేపథ్యంలో ఉమ్మడి సహకారం, సమన్వయం మరియు సంప్రదింపులను ఇటువంటి పర్యటనలు బలోపేతం చేస్తాయన్నారు. బహ్రెయిన్-సౌదీ సంబంధాలను పటిష్టం చేయడంలో కింగ్ సల్మాన్ చేసిన ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు.
తాజా వార్తలు
- పియూష్ గోయల్‌తో ఖతార్ కామర్స్ మినిస్టర్ భేటీ..!!
- ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక..స్వాగతించిన సౌదీ క్యాబినెట్..!!
- Dh1కి 10 కిలోల అదనపు లగేజ్..ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్..!!
- ముబారక్ అల్-కబీర్ లో క్లీనప్ డ్రైవ్..!!
- బహ్రెయిన్-సౌదీ సంబంధాలు చారిత్రాత్మకం..!!
- అల్ సలీల్ నేచురల్ పార్క్ రిజర్వ్ అభివృద్ధికి ఒప్పందం..!!
- ఆసియాకప్ ట్రోఫీని తీసుకెళ్లిన నఖ్వీ..
- బాణాసంచా తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం ఆరుగురు మృతి
- ఖతార్ లోని అల్ బలాదియా జంక్షన్ మూసివేత..!!
- జహ్రా నేచర్ రిజర్వ్ నవంబర్ నుండి ఒపెన్..!!