విదేశీ ఉద్యోగులకు హెచ్1బీ వీసా స్పాన్సర్ చేస్తాం: ఎన్విడియా CEO

- October 08, 2025 , by Maagulf
విదేశీ ఉద్యోగులకు హెచ్1బీ వీసా స్పాన్సర్ చేస్తాం: ఎన్విడియా CEO

అమెరికా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని నెలలుగా తన వాదనలో “మొత్తం ఉద్యోగాలు అమెరికన్లకే ఉండాలి” అనే విధంగా చెప్పడం తెలిసిన విషయం. ఈ విధానం ప్రకారం, విదేశీయులపై కఠినమైన నియమాలు అమలుపర్చే ప్రయత్నం కొనసాగుతోంది. తాజాగా, అమెరికా H-1B వీసా (H-1B Visa) విధానంలో ఒక పెద్ద మార్పు చేసింది. నిపుణుల H-1B వీసాకు సంబంధించి వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచినట్లు ప్రకటించారు.

విదేశీయులను ఉద్యోగాల్లోకి తీసుకోవాలనుకుంటే.. కంపెనీలు ఈ ఫీజు చెల్లించి వీసాలు స్పాన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం వల్ల భారతీయులపై ఎక్కువగా ప్రభావం పడింది. హె1బీ నిపుణుల వల్ల ఎక్కువ ప్రయోజనం పొందుతున్న టెక్ కంపెనీలు కూడా ట్రంప్ నిర్ణయాన్ని సమర్థించాయి.

టెగ్ దిగ్గజం ఎన్విడియా సీఈఓ జెన్సన్‌ హువాంగ్‌ అందులో ఒకరు. అయినప్పటికీ హెచ్1బీ ఫీజుల విషయంలో వెనకడుగు వేయమని చెప్పారు. విదేశీ నిపుణులకు వీసాలు స్పాన్సర్ చేయడం కొనసాగిస్తామన్నారు. ఈ మేరకు ఉద్యోగులకు ఈమెయిల్ పంపారు.

ఆ విదేశీ నిపుణులే లేకపోతే ఈ విజయం సాధ్యమయ్యేది కాదు. టెక్నాలజీ రంగంలో అమెరికా అగ్రగామిగా కొనసాగడానికి చట్టబద్ధమైన వలసలు అవసరమే. అందుకోసమే హెచ్1బీ వీసా ఫీజు పెంపుతో ఆగకుండా.. ప్రపంచ నలుమూలల నుంచి ట్యాలెంట్‌ను తీసుకుంటాం ” అని జెన్సన్‌ ఈ మెయిల్‌ లో రాసుకొచ్చారు.డొనాల్డ్ ట్రంప్ హెచ్1బీ వీసా ఫీజును పెంచడాన్ని జెన్సన్ హువాంగ్ గతంలో సపోర్ట్ చేశారు.

ఇలా చేయడం తనకు ఆనందంగా ఉందన్నారు. లక్షల డాలర్లు ఎక్కువే అయినా.. ఇది గొప్ప ప్రారంభమని చెప్పారు. అయితే స్టార్టప్‌ లు ఈ మొత్తాన్ని భరించలేవని తెలిపారు.ఎన్విడియా కంపెనీ పెద్ద మొత్తంలో హెచ్1బీ వీసాదారులను నియమించుకుంటోంది.

ప్రపంచంలోని ఏఐ రీసెర్చర్లలో సగం మంది చైనీయులే అని కంపెనీ గతంలో ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ నేపథ్యంలో హెచ్1బీ వీసాలను స్పాన్సర్ చేయడం తప్ప ఎన్విడియాకు మరో మార్గం లేకుండా పోయింది.

ఈ కెంపెనీ సీఈఓ ప్రకటన కూడా అందులో భాగమే అని విశ్లేషకులు అంటున్నారు.ట్రంప్ తీసుకువచ్చిన హెచ్1బీ వీసా ఫీజు పెంపును యూనియన్లు, విద్యా సంస్థలు, మతపరమైన సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com