గత వైభవ డిఫరెంట్ ఫాంటసీ మైథలాజికల్ మూవీ: హీరో ఎస్ఎస్ దుశ్యంత్

- October 08, 2025 , by Maagulf
గత వైభవ డిఫరెంట్ ఫాంటసీ మైథలాజికల్ మూవీ: హీరో ఎస్ఎస్ దుశ్యంత్

ఎస్ఎస్ దుశ్యంత్, అశికా రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఎపిక్ ఫాంటసీ డ్రామా గత వైభవ. సింపుల్ సుని దర్శకత్వంలో సర్వెగర సిల్వర్ స్క్రీన్స్, సుని సినిమాస్ బ్యానర్స్ పై దీపక్ తిమ్మప్ప, సుని నిర్మిస్తున్నారు.  ఈ సినిమా టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నవంబర్ 14న ఈ చిత్రం విడుదల కానుంది. తాజగా ఈ సినిమా నుంచి వర్ణమాల సాంగ్ ని లాంచ్ చేశారు.

సాంగ్ లాంచ్ ఈవెంట్ లో హీరో  దుశ్యంత్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. తెలుగు ప్రేక్షకులు అంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమాతో మీ అందరికి ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. డైరెక్టర్ సుని గారితో వర్క్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన కన్నడలో చాలా విజయవంతమైన సినిమాలు అందించారు. గత వైభవ అద్భుతమైన స్క్రిప్టు. హిస్టరీ మైథాలజీ సనాతన ధర్మ ఎలిమెంట్స్ అన్నీ అద్భుతంగా కుదిరిన స్క్రిప్ట్ ఇది. తెలుగు కన్నడ రెండిట్లోనూ షూట్ చేసాము. ఆశిక రంగనాథన్ తన కెరీర్ లో బెస్ట్ పెర్ఫార్మన్స్ ఈ సినిమాల్లో చేశారు. ఈ సినిమాల తనతో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్ తమ కెరీర్ బెస్ట్ వర్క్ ఇచ్చారు. శాండీ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమా నేను నెక్స్ట్ లెవెల్ తీసుకువచ్చారు. అనురాగ్ అద్భుతంగా  పాడారు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. మా నిర్మాత ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా గ్రాండ్ స్కేల్ లో తీశారు. రీసెంట్ ఓజి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఆర్ట్ మనుషుల్ని ఒక్కటి చేయాలని. ఆయన కన్నడ వెళ్తే కూడా అక్కడ చాలా అద్భుతమైన కన్నడలో మాట్లాడతారు. నేను కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నించాను. టీజర్ సాంగ్ రిలీజ్ చేసాము. ఇంకా మున్ముందు కంటెంట్ రిలీజ్ చేయబోతున్నాము. కంటెంట్ లో మీకు నిజాయితీ కనిపిస్తే తప్పకుండా సపోర్ట్ చేయండి. నవంబర్ 14న కన్నడ తెలుగులో గత వైభవ సినిమా రిలీజ్ అవుతుంది. తెలుగు ప్రేక్షకుల ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను.

హీరోయిన్  అశిక మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇప్పటివరకు నేను చేసిన రెండు తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఫస్ట్ కన్నడ సినిమా తెలుగులోకి వస్తోంది. అది గత వైభవ సినిమా కావడం చాలా స్పెషల్ ఫీలింగు. ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో చాలా డిఫరెంట్ సినిమా ఇది. డిఫరెంట్ గా ఉంటుంది. ఈ సినిమాలో నాలుగు డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి. చాలా ఇష్టంగా చేసిన సినిమా ఇది. డైరెక్టర్ సుని గారు సినిమాని చాలా అద్భుతంగా తీశారు. తెలుగు ప్రేక్షకులకు ఆయన స్టైల్ ఆఫ్ ఫిలిం మేకింగ్ ఇష్టపడతారని నమ్ముతున్నాను.

డైరెక్టర్ సునీ మాట్లాడుతూ అందరికీ నమస్కారం.ఇది ఫాంటసీ మైథిలాజికల్ మూవీ. నవంబర్ 14న రిలీజ్ అవుతుంది. మీరందరూ థియేటర్స్ లో చూస్తారని కోరుకుంటున్నాను.

ప్రొడ్యూసర్ దీపక్ మాట్లాడుతూ... ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాము. కంటెంట్ నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.

సింగర్ అనురాగ్ కులకర్ణి మాట్లాడుతూ..  ఈ పాట చాలా అద్భుతంగా వచ్చింది. చాలా ఇంట్రెస్టింగ్సినిమా ఇది.  మంచి సినిమాని సెలెబ్రేట్ చేయడం మన తెలుగు ప్రేక్షకు అలవాటు. అదే ప్రేమ ఈ టీముకు కూడా ఇస్తామని ఆశిస్తున్నాను.  

మ్యూజిక్ డైరెక్టర్ శాండీ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మ్యూజిక్ దేవుడిచ్చిన ఆశీర్వాదంగా భావిస్తున్నాను. గత వైభవ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందని నమ్మకం ఉంది

డీవోపీ విలియం మాట్లాడుతూ,.., అందరికి నమస్కారం ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో ఇది చాలా డిఫరెంట్ ఫిల్మ్.  డైరెక్టర్స్ సుని గారు అద్భుతంగా ఈ సినిమాని తీశారు. నిర్మాతలకి ధన్యవాదాలు. టెక్నికల్గా చాలా గ్రాండ్ సినిమా ఇది. తప్పకుండా మీరందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com