నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న సౌదీ శాస్త్రవేత్త ఒమర్ యాఘి..!!
- October 09, 2025
స్టాక్ హోమ్: సౌదీ అరేబియాకు చెందిన సైంటిస్ట్ ఒమర్ యాఘి.. కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నారు. మరో ఇద్దరు సైంటిస్టులు సుసుము కిటగావా మరియు రిచర్డ్ రాబ్సన్‌లతో కలిసి అవార్డును అందుకోనున్నారు. మెటర్-ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్స్ అభివృద్ధి కోసం వీరు కృషి చేశారని, వారి పరిశోధనలు ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ హితానికి దోహదం చేశాయని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. జోర్డాన్‌లో పాలస్తీనా తల్లిదండ్రులకు జన్మించిన యాఘికి 2021లో సౌదీ పౌరసత్వం లభించింది.
1901లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి ఇవ్వడం ప్రారంభమైంది. మొత్తం 11 మిలియన్ స్వీడిష్ క్రోనర్ ($1.2 మిలియన్లు) బహుమతిని అవార్డుతోపాటు అందజేస్తారు. స్వీడిష్ ఆవిష్కర్త ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామాతో స్థాపించబడిన నోబెల్ బహుమతులు.. సైన్స్, సాహిత్యం మరియు శాంతిలో అత్యుత్తమ విజయాలను సాధించిన వారిని గుర్తించి అందజేస్తారు. స్వయంగా రసాయన శాస్త్రవేత్త అయిన నోబెల్.. డైనమైట్ ఆవిష్కరణ నుండి వచ్చిన తన సంపదను ఒక శతాబ్దం క్రితం అవార్డులను స్థాపించడానికి ఉపయోగించాడు.
తాజా వార్తలు
- సల్మాన్ ఖాన్ కేసులో నిందితుడు అన్మోల్ ఇండియాకు అప్పగింత
- ధర్మ ధ్వజం: అయోధ్య నూతన వైభవం
- టీటీడీకి రూ.2 కోట్లు విరాళం
- సహాంలో పది మంది అరెస్టు..!!
- FIFA అరబ్ కప్ టికెట్ అమ్మకాలు నిలిపివేత..!!
- రిథమిక్ జిమ్నాస్టిక్స్ లో మెరిసిన 9 ఏళ్ల భారతీయ బాలిక..!!
- బహ్రెయిన్ లో గ్లోబల్ ఫుడ్ షో..!!
- యూఏఈలో లోన్ల పై సాలరీ పరిమితి ఎత్తివేత..!!
- వచ్చెనెల 30 నుంచి పది రోజుల పాటు వైకుంఠద్వార దర్శనాలు: TTD ఛైర్మన్
- శంకర నేత్రాలయ USA మిల్వాకీ కార్యక్రమం విజయం 770 మందికి కంటి చూపు







