కువైట్ లో ట్రాఫిక్ ఉల్లంఘనల పై భారీ జరిమానాలు..!!
- October 09, 2025
కువైట్: ట్రాఫిక్ ఉల్లంఘనలపై భారీగా జరిమానాలు విధించాలని కువైట్ నిర్ణయించింది. ఇకపై యూ-టర్న్ లు మరియు హైవే ఎగ్జిట్ ల వద్ద ఓవర్టేక్ చేయడం లేదా ఉద్దేశపూర్వకంగా ట్రాఫిక్‌ను అడ్డుకోవడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, బాధ్యులకు భారీగా జరిమానాలు విధిస్తామని కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వాహనదారులను హెచ్చరించింది.
ఇలాంటి చట్టవిరుద్ధమైన చర్యలు రోడ్డు భద్రతకు తీవ్రమైన ముప్పును కలిగిస్తాయని తెలిపింది. ఇలాంటి ఉల్లంఘనలకు KD 15 మరియు KD 20 మధ్య జరిమానా విధించబడుతుందని హెచ్చరించింది. రెండోసారి నేరాలకు పాల్పడిన వాహనాలను రెండు నెలల వరకు స్వాధీనం చేసుకుంటామని , ఈ మేరకు ట్రాఫిక్ పోలీసులకు అధికారం కల్పించినట్లు వెల్లడించింది. మళ్లీ మళ్లీ నేరాలకు పాల్పడే డ్రైవర్లపై కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యల కోసం కోర్టుకు తరలిస్తామని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. డ్రైవర్లు అందరూ ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, రహదారి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రిత్వశాఖ కోరింది.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో శాశ్వత శాంతి కోసం బహ్రెయిన్ పిలుపు..!!
- విషాదం..దుక్మ్ ప్రమాదంలో మరణించిన వ్యక్తుల గుర్తింపు..!!
- దుబాయ్-ఢిల్లీ ప్రయాణికులకు షాకిచ్చిన స్పైస్‌జెట్..!!
- GCC e-గవర్నమెంట్ అవార్డుల్లో మెరిసిన ఖతార్..!!
- కువైట్ లో ట్రాఫిక్ ఉల్లంఘనల పై భారీ జరిమానాలు..!!
- నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న సౌదీ శాస్త్రవేత్త ఒమర్ యాఘి..!!
- ఫోర్బ్స్ సంపన్నుల జాబితా..దేశంలో అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ..
- భారత్-యూకేల మధ్య వాణిజ్య ఒప్పందం
- కలుషిత దగ్గు సిరప్ కేసులో శ్రీసన్ ఫార్మా ఓనర్ అరెస్ట్
- బహ్రెయిన్‌లో వలస కార్మికుల సంఘానికి కొత్త కమిటీ..!!