'డ్యూడ్' టాప్ లెవల్ ఎంటర్టైన్మెంట్ ట్రైలర్ లాంచ్
- October 10, 2025
లవ్ టుడే, డ్రాగన్లతో రెండు వరుస హిట్లను అందించిన యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్‌తో దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. 'ప్రేమలు'అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్ సరసన మమిత బైజు నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ రోజు మేకర్స్ సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు.
సాంప్రదాయ ప్రేమ కథలకంటే భిన్నంగా ‘డ్యూడ్’ కథ ఒక యువకుడి జీవితం, ప్రేమతో మొదలవుతుంది. తాను అన్నీ అర్థం చేసుకున్నానని అనుకునే ఒక పక్కా రొమాంటిక్. అతని ప్రేమ జీవితం పర్ఫెక్ట్గా సాగుతున్నట్టు అనిపిస్తుందంతే కానీ, ఒక్కసారిగా నిజ జీవితం తలకిందులు అవుతుంది. అతని లవ్ దూరమవడం అతని మనసులో భావోద్వేగ తుఫాను తెచ్చిపెడుతుంది. అదే సమయంలో మరో అమ్మాయి అతని జీవితంలోకి అడుగు పెట్టడం, తాళి అనే అంశానికి కొత్త మీమింగ్ జోడిస్తుంది.
‘డ్యూడ్’ బ్రేకప్ గురించీ, లేదా కామెడీ గురించీ కాదు, రెండింటి మధ్య ఉన్న ఆ గందరగోళమైన, అందమైన ఫీలింగ్ గురించీ. ట్రైలర్లో కామెడీ, ఎమోషన్స్, మోడరన్ యూత్ వైబ్స్ పర్ఫెక్ట్ గా వున్నాయి.
ప్రదీప్ తన నేచురల్ హ్యుమర్, ఎమోషన్స్ అదరగొట్టాడు. మమితా బైజు తన పాత్రలో కట్టిపడేసింది. నేహా శెట్టి ప్రెజెన్స్ ఇంట్రస్టింగ్ గా వుంది. శరత్‌కుమార్, రోహిణి మొల్లెట్టి, హృదు హారూన్, ద్రవిడ్ సెల్వం లాంటి నటులు కథకు మరింత బలాన్ని జోడించారు.
డెబ్యుట్ డైరెక్టర్ కీర్తిశ్వరన్ కామెడీ, సెంటిమెంట్ మధ్య సున్నితమైన బ్యాలెన్స్‌ను అద్భుతంగా చూపించారు. నికేత్ బొమ్మి విజువల్స్ , సాయి అభ్యంకర్ సంగీతం అద్భుతంగా వున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ వాల్యూస్ ప్రతి ఫ్రేమ్‌లో కనిపించాయి. ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది.
అక్టోబర్ 17న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కి సిద్ధమవుతున్న ‘డ్యూడ్’ ఈ సీజన్‌ను నవ్వులు, మ్యూజిక్, ఎమోషన్స్ తో అలరించనుంది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సినిమా ప్రమోషన్స్ కి వస్తున్న రెస్పాన్స్ చాలా ఆనందంగా ఉంది. ఈవెంట్లకు వెళ్తున్నప్పుడు ఆడియన్స్ ఇంత పెద్ద స్థాయిలో రావడం నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఇంత ప్రేమని అందిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మైత్రి మూవీ మేకర్స్ నవీన్ గారికి రవి గారికి థాంక్యూ. మైత్రి మూవీ మేకర్స్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ ఇన్ ఇండియా. వాళ్ళతో పని చేస్తున్నప్పుడు ఎందుకు ఇండియాలో నెంబర్ వన్ సంస్థగా ఉన్నారో అర్థమైంది. చాలా ప్యాషన్ తో పని చేస్తారు. సినిమా ట్రైలర్ కి తెలుగు తమిళ్లో అద్భుతమైన స్పందన వచ్చింది. తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈక్వల్ గా వ్యూస్ రావడం నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ట్రైలర్లో మీరు చాలా ఎంటర్టైన్మెంట్ చూసారు. సినిమాల్లో చాలా డ్రామా ఎమోషన్ ఉంటుంది. మీరు ఊహించని ఎలిమెంట్స్ ఉంటాయి. సినిమాలో అద్భుతమైన క్యారెక్టర్ చేసిన శరత్ కుమార్ గారికి థాంక్యూ ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్. యూత్ తో పాటు ఫ్యామిలీస్ సినిమాని ఇష్టపడతారు. దీపావళికి సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాతో పాటు రిలీజ్ అవుతున్న తెలుసు కదా, మిత్రమండలి, కే ర్యాంప్ సినిమాలు అద్భుతంగా ఆడాలని కోరుకుంటున్నాను.డ్యూడ్ సినిమా కచ్చితంగా తెలుగు ఆడియన్స్ కి నచ్చుతుంది.
యాక్టర్ శరత్ కుమార్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. డ్యూడ్ సినిమా ఒక మంచి వైబ్. ట్రైలర్లో మీరు చూసింది 10 శాతమే. ఈ సినిమా గ్యారంటీ హిట్టు. ఈ సినిమాలో చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది. చాలా కొత్త కథ ఇది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. రవి గారికి థాంక్యూ. ప్రదీప్ ఈ సినిమాతో అందరినీ ఎంటర్టైన్ చేస్తాడు. ఇది హోల్సమ్ ఎంటర్టైనర్. దీపావళికి వస్తున్న సినిమాలన్నీ కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అందరూ థియేటర్స్ లో సినిమా చూసి ఎంజాయ్ చేయాలని ఆశిస్తున్నాను.
ప్రొడ్యూసర్ రవిశంకర్ మాట్లాడుతూ... అందరికి నమస్కారం. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ప్రదీప్ మమత బైజు శరత్ కుమార్ గారు ఒకరికి మించి ఒకరు పెర్ఫార్మ్ చేశారు. సినిమా చాలా కొత్తగా ఉంటుంది. ట్రైలర్లో కేవలం సినిమా వైబ్ మాత్రమే ప్రజెంట్ చేశాం. చాలా కంటెంట్ ఉంది. మీరు మాక్సిమం ఎంజాయ్ చేస్తారు. తెలుగులో తమిళ్ వస్తుంది. సాంగ్స్ పెద్ద హిట్. సాయి అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారు. డైరెక్టర్ కీర్తి చెప్పిన దానికంటే అద్భుతంగా తీశారు. ఇందులో హీరో హీరోయిన్ మధ్య సీన్స్ మామూలుగా ఉండవు. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. దీపావళికి వస్తున్న కిరణ్ అబ్బవరం గారి సినిమా, మిత్రమండలి, తెలుసు కదా చిత్రాలు కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. మైత్రి మూవీ మేకర్స్ నుంచి డ్యూడ్ ట్రైలర్ రిలీజ్ అయింది. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ఆడియో చాలా పెద్ద హిట్ అయింది. ప్రదీప్ గారితో ఇది మాకు రెండో సినిమా. డ్రాగన్ తో పెద్ద హిట్ కొట్టాం. అంతకుమించి పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మా నవీన్ గారికి రవి గారికి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.
తారాగణం: ప్రదీప్ రంగనాథన్, శరత్ కుమార్, మమిత బైజు, నేహా శెట్టి, రోహిణి మొల్లెటి, హృదు హరూన్, ద్రవిడ్ సెల్వం
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: కీర్తిశ్వరన్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
CEO: చెర్రీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అనిల్ యెర్నేని
సంగీతం: సాయి అభ్యంకర్
సినిమాటోగ్రాఫర్: నికేత్ బొమ్మి
ప్రొడక్షన్ డిజైనర్: లతా నాయుడు
కాస్ట్యూమ్ డిజైనర్: పూర్ణిమా రామస్వామి
ఎడిటర్: బరత్ విక్రమన్
తమిళ PRO: సురేష్ చంద్ర, సతీష్
తెలుగు PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
తాజా వార్తలు
- దుబాయ్ లో అక్టోబర్ 12న FOI ఈవెంట్స్ దీపావళి ఉత్సవ్
- ఏపీ: నకిలీ మద్యం కేసు..రహస్య ప్రదేశంలో కింగ్ పిన్ విచారణ..
- ఐపీఎల్ మినీ వేలానికి ముహూర్తం ఫిక్స్
- భారత్‌లో 9 బ్రిటన్ యూనివర్శిటీల క్యాంపస్
- ఐటీ హబ్‌గా ఆంధ్ర ప్రదేశ్..
- మైక్రోసాఫ్ట్ సలహాదారుగా రిషి సునాక్
- ఆరుగురు కొత్త కంటెస్టెంట్లు ఎంట్రీ
- ఖతార్ ఆకాశంలో కనువిందు చేసిన అద్భుతం..!!
- మసీదులు, స్కూళ్ల వద్ద పొగాకు షాప్స్ పై నిషేధం..!!
- Dh430,000 గెలుచుకున్న భారత్, బంగ్లా ప్రవాసులు..!!