'ప్రేమంటే' మెస్మరైజింగ్ రొమాంటిక్ మెలోడీ దోచావే నన్నే సాంగ్
- October 10, 2025
స్ట్రాంగ్ కంటెంట్ బేస్డ్ సినిమా చేస్తున్న ప్రియదర్శి ప్రస్తుతం రానా దగ్గుబాటి సమర్పణలో పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వి నారంగ్ నిర్మాణంలో రిఫ్రెషింగ్ రొమాంటిక్ కామెడీ మూవీ ప్రేమంటే తో రాబోతున్నారు. ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది. సుమ కనకాల ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్ గా అరంగేట్రం చేస్తున్నారు. "థ్రిల్-యు ప్రాప్తిరస్తు!" అనేది ట్యాగ్‌లైన్. దివంగత నారాయణ్ దాస్ నారంగ్ వారసత్వాన్ని కొనసాగిస్తూ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP (SVCLLP)ప్రతిష్టాత్మక బ్యానర్ నిర్మిస్తోంది. స్పిరిట్ మీడియా సమర్పిస్తుంది.
ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ లో భాగంగా ఫస్ట్ సింగిల్ 'దోచావే నన్నే'ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటను నేచురల్ స్టార్ నాని లాంచ్ చేశారు. లియోన్ జేమ్స్ స్వరపరిచిన ఈ రొమాంటిక్ ట్రాక్ అదిరిపోయింది. సాఫ్ట్ మెలోడీకి స్టైలిష్ విజువల్స్‌ను మేళవించి ఈ సింగ్ ప్రేమలో ఉన్న ఎమోషన్ ని అందంగా ప్రజెంట్ చేసింది. ఎలిగెంట్ డ్యాన్స్ సీక్వెన్స్‌లు ఆకట్టుకున్నాయి.
అబ్బీ వి వాయిస్ ఈ పాటకు ప్రాణం పోసింది. శ్రీమణి రాసిన సాహిత్యం హార్ట్ టచ్చింగ్ వుంది. ప్రియదర్శి, ఆనంది కెమిస్ట్రీ చాలా సహజంగా, హృదయానికి హత్తుకునేలా ఉంది.
ఈ చిత్రానికి సహ నిర్మాత ఆదిత్య మెరుగు. ‘గామీ’ సినిమాకు గద్దర్ అవార్డు అందుకున్న సినిమాటోగ్రాఫర్ విష్ణునాథ్ రెడ్డి తన విజువల్ మ్యాజిక్‌తో ఫ్రేమ్‌లను అద్భుతంగా ప్రజెంట్ చేస్తున్నారు. రాఘవేంద్ర ఎడిటర్, ప్రొడక్షన్ డిజైన్ అరవింద్ ములే, డైలాగ్స్ కార్తిక్ తుపురాణి, రాజ్‌కుమార్ అందించారు.
‘ప్రేమంటే’ సినిమా మ్యూజిక్ డ్రైవన్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే సారేగామ ఈ చిత్ర ఆడియో హక్కులను సొంతం చేసుకోవడం సంగీతంపై ఉన్న నమ్మకాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది.
నటీనటులు: ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: నవనీత్ శ్రీరామ్
నిర్మాతలు: పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వీ నారంగ్
సమర్పణ: రానా దగ్గుబాటి
బ్యానర్లు: SVCLLP, స్పిరిట్ మీడియా
సహ నిర్మాత: ఆదిత్య మేరుగు
సినిమాటోగ్రఫీ: విశ్వనాథ్ రెడ్డి
సంగీతం: లియోన్ జేమ్స్
ఎడిటింగ్: రాఘవేంద్ర తిరున్
డైలాగ్స్: కార్తీక్ తుపురాణి & రాజ్‌కుమార్
ప్రొడక్షన్ డిజైనర్: అరవింద్ మ్యూల్
కాస్ట్యూమ్ డిజైనర్: గౌరీ నాయుడు
PRO: వంశీ-శేఖర్
పబ్లిసిటీ డిజైనర్: పద క్యాసెట్
మ్యూజిక్ ఆన్: సరిగమ
తాజా వార్తలు
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్‌ను నిర్వహించిన జనసేన గల్ఫ్‌సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!







