నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- January 13, 2026
యూఏఈ: దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (DXB) మూడు టెర్మినల్స్ లో ఈ-వాలెట్ పార్కింగ్ కోసం దుబాయ్ రోడ్ టోల్ సంస్థ సాలిక్ తో ఒక ఒప్పందాన్ని చేసుకుంది. ఈ మేరకు దుబాయ్ విమానాశ్రయాల ఛైర్మన్ షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్ మక్తౌమ్ మరియు సాలిక్ ఛైర్మన్ మట్టర్ అల్ తాయర్ 10 సంవత్సరాల ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం ప్రకారం.. DXBలోని అన్ని పెయిడ్ కార్ పార్కింగ్‌లలో సాలిక్ ఈ-వాలెట్ చెల్లింపులకు అనుమతించనున్నారు. ఇది జనవరి 22, 2026 నుండి అమల్లోకి వస్తుందని ప్రకటించారు.
దుబాయ్ ఇంటర్నేషనల్ ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో ఒకటి. జూలై మరియు సెప్టెంబర్ మధ్య 24.2 మిలియన్ల అతిథులకు సేవలు అందించింది. 2025 మొదటి తొమ్మిది నెలలకు మొత్తం ట్రాఫిక్ 70.1 మిలియన్లుగా నమోదైంది.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







