సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!

- January 13, 2026 , by Maagulf
సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!

రియాద్: సౌదీ విజన్ 2030 ప్రారంభించినప్పటి నుండి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం రెట్టింపు అయింది.  2024లో ఇది 119.2 బిలియన్ల సౌదీ రియాళ్లకు చేరుకుందని పెట్టుబడుల శాఖ మంత్రి ఖలీద్ అల్-ఫాలిహ్ అన్నారు. రియాద్‌లో జరిగిన సౌదీ-జపనీస్ మంత్రిత్వ ఫోరంలో ఆయన మాట్లాడుతూ.. సౌదీ అరేబియాలో మొత్తం విదేశీ పెట్టుబడులు 977.3 బిలియన్ల సౌదీ రియాళ్లకు చేరుకుందని తెలిపారు.

2026 నాటికి రియల్ ఎస్టేట్ మరియు ఆర్థిక మార్కెట్లను విదేశీ పెట్టుబడిదారులకు ఓపెన్ చేయడం వల్ల ప్రపంచ ఆర్థిక కేంద్రంగా సౌదీ స్థానం బలోపేతం అవుతుందని అల్-ఫాలిహ్  చెప్పారు. అలాగే,  2016 నుండి సౌదీ అరేబియా, జపాన్ మధ్య వాణిజ్యంలో 38 శాతం వృద్ధి నమోదైనట్లు ఆయన తెలిపారు.  రెండు దేశాల మధ్య వాణిజ్య పరిమాణం 138 బిలియన్ల సౌదీ రియాళ్లకు చేరుకుందని పేర్కొన్నారు.  

18 జపనీస్ కంపెనీలు రియాద్‌లో తమ ప్రాంతీయ ప్రధాన కార్యాలయాలను స్థాపించాయని గుర్తుచేశారు. జపనీస్ కంపెనీలకు 120కి పైగా పెట్టుబడి లైసెన్సులు మంజూరు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. జపాన్‌కు అతిపెద్ద ఇంధన సరఫరాదారుగా సౌదీ కొనసాగుతోందని, స్వచ్ఛమైన ఇంధన పరివర్తన ప్రాజెక్టులపై ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com