ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- January 13, 2026
దోహా: ఓల్డ్ దోహా పోర్ట్ ప్రకటించిన ప్రకారం, మార్చి 25 నుండి 27వరకు ఫిషింగ్ పోటీ మూడవ ఎడిషన్ జరుగనుంది. ఈ పోటీలో విజేతలకు కార్లతో సహా QR 600,000 కంటే ఎక్కువ విలువైన బహుమతులు అందించనున్నారు.
మొదటి బహుమతి విజేతకు ట్యాంక్ 500, రెండవ స్థానంలో నిలిచిన వారికి ట్యాంక్ 300, మరియు మూడవ స్థానంలో నిలిచిన వారికి హవల్ H9 కార్లు లభిస్తాయి. ఈ కార్లన్నింటినీ టేసీర్ మోటార్స్ అందిస్తుంది. వీటితోపాటు నగదు మరియు ఇతర బహుమతులు కూడా మొదటి పది జట్లకు అందజేయబడతాయి. ఇది పోటీ ప్రారంభమైనప్పటి నుండి అందించే అత్యంత విలువైన బహుమతులు ఇవే కావడం విశేషం.
ఈ పోటీ ఫిషింగ్ ఎగ్జిబిషన్ రెండవ ఎడిషన్‌తో పాటు జరుగుతోంది. పాల్గొనే జట్లు ఓల్డ్ దోహా పోర్ట్ నుండి బయలుదేరి, మూడు రోజుల పాటు ఖతార్ జలాల్లో అతిపెద్ద కింగ్‌ఫిష్ (కనద్)ను పట్టుకోవడానికి పోటీపడతారని ఓల్డ్ దోహా పోర్ట్ సీఈఓ ఇంజనీర్ మహమ్మద్ అబ్దుల్లా అల్ ముల్లా తెలిపారు. మత్స్యకారులకు మద్దతు ఇవ్వడం, ఖతార్ గుర్తింపులో అంతర్భాగంగా ఉన్న ఒక సంప్రదాయాన్ని పరిరక్షించడం ఫిషింగ్ పోటీ ముఖ్య ఉద్దేశ్యం అని అన్నారు.
తాజా వార్తలు
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్‌ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!







