టిటిడిలో అనిల్ కుమార్ సింఘాల్ మార్కుపాలన షురూ!

- October 10, 2025 , by Maagulf
టిటిడిలో అనిల్ కుమార్ సింఘాల్ మార్కుపాలన షురూ!

తిరుమల: తొలివిడతగా డిప్యూటీ ఇఒలు బదలీలు వారంరోజుల్లో కీలకస్థానాల అధికారులకు స్థానచలనం తిరుమల రూపొందించే ధార్మికసంస్థ తిరుమల తిరుపతిదేవస్థానంలో సుదీర్ఘకాలం తిష్టవేసిన…ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు అధికారులు, ఉద్యోగులకు స్థానచలనం కల్పించడానికి టిటిడి ఇఒ అనిల్ కుమార్ సింఘాల్ శ్రీకారం చుట్టారు. టిటిడిలో సేవాభావంతో విధులు నిర్వహిస్తున్న కొందరు అధికారులు, ఉద్యోగులు ఎజెండాగా అభివృద్ధిపనుల నిర్ణయాలను, కొన్ని తీర్మానాలను ముందుగానే వేగులుగా గత పాలకమండలి పెద్దలకు చేరవేసి రాజకీయం చేస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. ఇదే విషయంగా ఏడాదికాలంగా టిటిడి పై దుష్ప్రచారాలు సాగడం, పనిగట్టుకుని కొందరు ప్రతిదీ భూతద్దంలో చూపేలా కారణమవుతున్నారనేది బోర్డుక అందిన సమాచారం.

ఈ నేపధ్యంలో బ్రహ్మోత్సవాలకు ముందు ఇఒగా రెండవసారి బాధ్యతలు చేపట్టిన సింఘాల్ పాలనను గాడిన పెట్టడానికి భారీ వ్యూహాన్ని రూపొందించారు. బ్రహ్మోత్సవాలు ముగియగానే వారంరోజుల్లో ఒక్కసారిగా డిప్యూటీ ఇఒ స్థాయి అధికారులను పూర్తిగా బదిలీ చేసి టిటిడిలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారనేది ప్రస్పుటమవుతోంది. గత వైసిపి పాలనలో, టిటిడి బోర్డులో బదిలీలకు గురైన డిప్యూటీ ఇఒలను పూర్తిగా స్థానచలనం చేశారు. తిరుమల ఆలయ డిప్యూటీ ఇఒగా ఉన్న ఎం.లోకనాథంను తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ డిప్యూటీ ఇఒగా, తిరుచానూరు పద్మావతిఅమ్మవారి ఆలయ డిప్యూటీ ఇఒ పి, హరీంధ్రనాథ్ను ఏకంగా మళ్ళీ రెండవసారి తిరుమల ఆలయ డిప్యూటీ 22 నియమించారు.

తిరుమలలో వసతి కల్పన విభాగం డిప్యూటీ ఇఒ (ఆర్1)భాస్కరన్ను టిటిడి పరిపాలన భవనంలోని సర్వీసెస్ విభాగానికి, ఇక్కడ ఉన్న గోవిందరాజన్ ను తిరుమల కల్యాణకట్టకు, అన్నదానం డిప్యూటీ ఇఒగా సెల్వంను, వసతికల్పనవభాగం డిప్యూటీ ఇఒ(ఆర్1)గా అన్నదానం డిప్యూటీ ఇఒ రాజేంద్రను నియమించారు. ఆర్2గా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ డిప్యూటీ ఇఒగా గోవిందరాజస్వామి ఆలయం నుండి శాంతిని, కల్యాణకట్టనుండి వెంకటయ్యను తిరుపతి అన్నదానం డిప్యూటీ ఇఒగా బదిలీ చేశారు. ఇక రెండుమూడురోజుల్లో పూర్తిస్థాయిలో ఆలయం నుండి వసతికల్పన విభాగం, దాతల విభాగం, మార్కెటింగ్ విభాగంతోబాటు స్థానిక ఆలయాల్లో ఉన్న, కీలకమైన కొన్ని విభాగాల సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లను బదిలీ చేసేందుకు రంగం సిద్ధంచేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com