కువైట్ లో భద్రతా సంసిద్ధత, కార్యచరణపై సమీక్ష..!!
- October 10, 2025
కువైట్: కువైట్ లో భద్రతా దళాల కార్యచరణను సమీక్షించారు. భద్రతా రంగాల అధిపతులతో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాత్కాలిక అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ అలీ అల్-అద్వానీ సమావేశం అయ్యారు. హాజరైన వారికి మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఫహద్ యూసఫ్ సౌద్ అల్-సబా శుభాకాంక్షలు తెలియజేశారని అల్-అద్వానీ తెలిపారు.
ఈ సందర్భంగా వివిధ భద్రతా రంగాలలోని సిబ్బంది అంకితభావం మరియు నిరంతర పనిని ఆయన ప్రశంసించారు. అత్యవసర పరిస్థితులకు తగ్గట్లుగా క్షేత్రస్థాయిలో సంసిద్ధతను పెంచాలని ఆయన పిలుపునిచ్చారు. ఉద్యోగుల మధ్య సానుకూల పని వాతావరణాన్ని పెంపొందించడానికి "ఓపెన్ డోర్" విధానాన్ని అమలు చేయడం గురించిన ప్రాముఖ్యతను యాక్టింగ్ అండర్‌సెక్రటరీ అల్-అద్వానీ హైలైట్ చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో అక్టోబర్ 12న FOI ఈవెంట్స్ దీపావళి ఉత్సవ్
- ఏపీ: నకిలీ మద్యం కేసు..రహస్య ప్రదేశంలో కింగ్ పిన్ విచారణ..
- ఐపీఎల్ మినీ వేలానికి ముహూర్తం ఫిక్స్
- భారత్‌లో 9 బ్రిటన్ యూనివర్శిటీల క్యాంపస్
- ఐటీ హబ్‌గా ఆంధ్ర ప్రదేశ్..
- మైక్రోసాఫ్ట్ సలహాదారుగా రిషి సునాక్
- ఆరుగురు కొత్త కంటెస్టెంట్లు ఎంట్రీ
- ఖతార్ ఆకాశంలో కనువిందు చేసిన అద్భుతం..!!
- మసీదులు, స్కూళ్ల వద్ద పొగాకు షాప్స్ పై నిషేధం..!!
- Dh430,000 గెలుచుకున్న భారత్, బంగ్లా ప్రవాసులు..!!