బహ్రెయిన్ లో గ్రాండ్ దీపావళి గాలా..!!

- October 10, 2025 , by Maagulf
బహ్రెయిన్ లో గ్రాండ్ దీపావళి గాలా..!!

మనామా: గ్రాండ్ దీపావళి వేడుకులకు బహ్రెయిన్ సిద్ధమవుతోంది.  స్టార్‌విజన్ ఈవెంట్స్‌ తో కలిసి భారతి అసోసియేషన్ ఈ సంవత్సరం గ్రాండ్ దీపావళి వేడుకను నిర్వహించనుంది.  ఇందులో ప్రముఖ వక్త దిండిగల్ I. లియోని పాల్గొననున్నారు. ఈ మేరకు ఉమ్ అల్ హస్సామ్‌లోని భారతి అసోసియేషన్ ప్రాంగణంలో వివరాలను వెల్లడించారు.

దీపావళి గాలా వేడుక అక్టోబర్ 17న సల్మాబాద్‌లోని గోల్డెన్ ఈగిల్ క్లబ్ ఇండోర్ ఆడిటోరియంలో జరగనుందని అసోసియేషన్ అధ్యక్షుడు వల్లం బషీర్ వెల్లడించారు. ఈ సందర్భంగా సాహిథ్య చర్చలు జరుగుతాయని తెలిపారు. నృత్యకళారత్న హన్సుల్ బృందం బహ్రెయిన్‌లో భారతీయ సంస్కృతిని చాటిచెప్పే ప్రదర్శన ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి అందరికీ ప్రవేశం ఉచితమని, ముందుగా వచ్చిన వారికి ముందుగా సీట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com