Dh430,000 గెలుచుకున్న భారత్, బంగ్లా ప్రవాసులు..!!

- October 10, 2025 , by Maagulf
Dh430,000 గెలుచుకున్న భారత్, బంగ్లా ప్రవాసులు..!!

యూఏఈ: బిగ్ టికెట్ ది బిగ్ విన్ కాంటెస్ట్ మరోసారి నలుగురు భారతీయ, బంగ్లాదేశ్ ప్రవాసులను విజేతలుగా నిలిపింది. సిరీస్ 279 బిగ్ టికెట్ డ్రాలో విజేతలు Dh430,000 మొత్తాన్ని కలిపి బహుమతిగా అందుకున్నారు.  

భారత్ నుండి వచ్చిన రియాస్ పనయకాండియిల్ Dh150,000 గెలుచుకున్నాడు. తన టికెట్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేశాడు.   గత 14 సంవత్సరాలుగా తన కుటుంబంతో షార్జాలో నివసిస్తున్న ముంబైకి చెందిన HR ప్రొఫెషనల్ సుసాన్ రాబర్ట్ Dh110,000  గెలుచుకొని బిగ్ టికెట్ తాజా విజేతలలో ఒకరిగా నిలిచాడు.    

గత 15 సంవత్సరాలుగా దుబాయ్‌లోని లోడింగ్ మరియు అన్‌లోడింగ్ పరిశ్రమలో పనిచేస్తున్న 35 ఏళ్ల బంగ్లాదేశ్ ప్రవాసి అలిమ్ ఉద్దీన్ సోంజా మియా Dh85,000 గెలుచుకున్నారు. తన 10 మంది స్నేహితుల బృందంతో ప్రతి నెలా బిగ్ టికెట్ ఎంట్రీలను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపాడు.

2001 నుండి అల్ ఐన్‌లో నివసిస్తున్న 49 ఏళ్ల బంగ్లాదేశ్ హౌస్ డ్రైవర్ నజ్రుల్ ఇస్లాం ఫకీర్ అహ్మద్ Dh85,000 విజేతగా నిలిచాడు. గత 24 సంవత్సరాలుగా 10 మంది స్నేహితుల బృందంతో ప్రతి నెలా బిగ్ టికెట్ ఎంట్రీలను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com