మసీదులు, స్కూళ్ల వద్ద పొగాకు షాప్స్ పై నిషేధం..!!

- October 10, 2025 , by Maagulf
మసీదులు, స్కూళ్ల వద్ద పొగాకు షాప్స్ పై నిషేధం..!!

రియాద్: మసీదులు మరియు పాఠశాలలకు 500 మీటర్ల దూరంలో పొగాకు దుకాణాలను నడపడంపై సౌదీ అరేబియా నిషేధం విధించింది. ఈ విషయంలో మునిసిపాలిటీలు, గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ లు చేపట్టిన నియంత్రణ చర్యలను ఆమోదించింది. ప్రజారోగ్యాన్ని ప్రోత్సహించడం, సౌదీ అంతటా సురక్షితమైన వాణిజ్య వాతావరణాన్ని సృష్టించడమే లక్ష్యంగా పొగాకు వినియోగంపై నిషేధం విధించినట్లు వెల్లడించారు.

అన్ని సిగరెట్లు, షిషా మరియు ఇ-సిగరెట్లు సహా పొగాకు ఉత్పత్తులు మరియు ఉపకరణాలను విక్రయించే అన్ని దుకాణాలకు కొత్త నిబంధన వర్తిస్తుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అలాగే, 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఎవరికైనా పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తే.. కేసులు నమోదు చేసి భారీ జరిమానాలతోపాటు జైలు శిక్ష కూడా విధిస్తామని హెచ్చరించింది.

సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ ఆమోదించిన ప్రామాణిక స్పెసిఫికేషన్‌లకు అనుగుణంగా లేని సింగిల్ సిగరెట్లు లేదా ఉత్పత్తుల అమ్మకాన్ని నిషేధించినట్లు పేర్కొన్నారు. ఇ-సిగరెట్ ద్రవాలను పొగాకుతో ఫిల్ చేయడాన్ని కూడా నిషేధించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com