ఈరోజు కొత్త సినిమాలు విడుదలకు లేవు

- July 17, 2015 , by Maagulf
ఈరోజు కొత్త సినిమాలు విడుదలకు లేవు

ఎప్పుడు శుక్రవారం వస్తుందా..ఎప్పుడు కొత్త సినిమా చూద్దామా..అని ప్రతి సినీ అబిమానికి ఉంటుంది..దాని క్యాచ్ చేసుకొని నిర్మాతలు తమ సినిమాలు వీకెండ్ లో రిలీజ్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకుంటారు..కానీ ఈ వారం మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త సినిమాల సందడి లేకుండా పోయింది. గత వారం రిలీజ్ అయిన బాహుబలి హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. బాహుబలి విడుదలై వారం కావొస్తున్న ఇంకాటికెట్స్ దొరకని పరిస్థితి, దీంతో తమ సినిమాలు రిలీజ్ చేసిందుకు నిర్మాతలు ముందుకు రాలేదు. మహేష్ శ్రీమంతుడు, రవి తేజ కిక్ 2 , అనుష్క రుద్రమదేవి వంటి భారీ చిత్రాలే బాహుబలి చిత్రానికి భయపడి ఓ నెల వెనక్కి పోయాయి. అసలు ఈ వారం అల్లరి నరేష్ హీరోగా నటించిన 'జేమ్స్‌బాండ్', మంచు విష్ణు 'డైనమైట్‌' చిత్రాలు ఈరోజు రిలీజ్ అని ప్రకటన చేసిన బాహుబలి కి వస్తున్న కలెక్షన్స్ చూసి, ఈ వారం రిలీజ్ చేస్తే కనీసం పోస్టర్స్ కు అయిన ఖర్చు రాదని భావించి ఆ చిత్రాలు పోస్ట్ పోనే చేసారు. ఇప్పటికి 200 కోట్ల మార్క్ దాటినా బాహుబలి ఇంకో 2, 3 రోజుల్లో 300 మార్క్ దాటడం ఖాయం అని అంటున్నారు సినీ ప్రముఖులు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com