ఎయిమ్స్‌కు మోదీ శంకుస్థాపన

- July 22, 2016 , by Maagulf
ఎయిమ్స్‌కు మోదీ శంకుస్థాపన

ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లో పర్యటించారు. గోరఖ్‌పూర్‌లో రూ. 1,011 కోట్లతో ఏర్పాటుచేయనున్న ఎయిమ్స్‌కు మోదీ శంకుస్థాపన చేశారు. 150 ఆపరేషన్‌ థియేటర్లు, 750 పడకలతో ఎయిమ్స్‌ను ఏర్పాటుచేయనున్నారు. దీంతో పాటు ఎరువుల ప్లాంట్‌ పునరుద్ధరణకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. ఫెర్టిలైజర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌కు చెందిన ఈ ప్లాంట్‌ 1990 నుంచి ఖాళీగా ఉంది. దీంతో రూ. 6వేల కోట్లతో ప్లాంట్‌ను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది.
ఈ ప్లాంట్‌ను తిరిగి ప్రారంభిస్తే.. 4వేల మందికి ఉద్యోగాలు లభించడంతో పాటు రైతులకు యూరియా అందుతుంది. ఇటీవల కేంద్ర కేబినెట్‌ ప్లాంట్‌ పునరుద్ధరణతో పాటు ఎయిమ్స్‌ ప్రతిపాదనను కూడా ఆమోదించింది. దీంతో ఈ రెండింటికి ప్రధాని మోదీ నేడు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, కల్‌రాజ్‌ మిశ్రా, అనంత్‌ మిశ్రా, పీయూష్‌ గోయల్‌, యూపీ గవర్నర్‌ రామ్‌ నాయక్‌, భాజపా ఎంపీ యోగి ఆదిత్యనాథ్‌ తదితరులు పాల్గొన్నారు. శంకుస్థాపన కార్యక్రమానికి ముందు ప్రధాని మోదీ గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్‌ ఆలయాన్ని దర్శించుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com