షార్జాలో అధిక వేగంగా వాహనం నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకొన్న యువకులు
- July 22, 2016
షార్జాలో 180 కీ.మీ వేగంతో వాహనం నడిపి ట్రక్ ని గుద్ది ప్రాణాల మీదకు తెచ్చుకొన్నారా...యువకులు ఈ ప్రమాదంలో వాహనం నడిపిన యువకుడు తీవ్ర గాయాల పాలవ్వడమే కాక తన పక్కనున్న స్నేహితుడి మరణానికి పరోక్ష కారణమయ్యాడు. షార్జాలోని అల్ దాడి -నిజవా రోడ్ ప్రమాదంలో వారిరువురు తీవ్రమైన గాయాల పాలయ్యారు అయితే కొద్దిసేపటికి ఒక యువ ఎమిరేట్ వాసి మరణించాడు. సెంట్రల్ ఆపరేషన్స్ రూమ్ కు ఒక భయంకరమైన రోడ్డు ప్రమాదం గురించి బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఒక ఫోన్ కాల్ అందుకున్నట్లు ఆ ప్రమాదంలో ఒక కారు మరియు ఒక ట్రక్ డీ కొన్నట్లు షార్జా పోలీస్ తెలిపారు.
గస్తీ పోలీస్ మరియు అంబులెన్సులు ప్రమాద స్థలానికి తరలించారు అక్కడ ఒక 21 ఏళ్ల యువకుడు చనిపోయి ఉండటం, వాహనం నడిపిన 24 ఏళ్ల యువకుడు తీవ్రమైనగాయాలపాలై అపస్మారక స్థితిలో పది ఉండటం గమనించారు. ప్రాధమిక విచారణలో ఈ యువకులు తమ కారుని గంటకు 180 కిలోమీటర్లకు పైగా వేగంతో డ్రైవింగ్ చేస్తుండటంతో ఈ దుర్ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఒకే వరుస ఉన్న రహదారిపై అత్యంత వేగంగా కారుని డ్రైవింగ్ చేస్తున్న యువకునికి మలుపులో అకస్మాత్తుగా ఒక ట్రక్ ఎదురుగా రావడంతో ఆశ్చర్యపడ్డాడు. తన కారుని ఆపేందుకు తీవ్ర ప్రయత్నం చేసినప్పటికీ వాహనంని నియంత్రించడానికి వీలుపడలేదు. దీనితో ట్రక్ లోకి దూసుకుపోయింది కారు ఈ ప్రమాదంలో తృటిలో మరణం నుంచి తప్పుకొన్న ఆ ట్రక్ డ్రైవర్ కిందకు దిగి కారులోకి తొంగి చూసిన డ్రైవర్ కు రక్తం మడుగులో కారు నడిపిన వ్యక్తి సజీవంగా ఉండగా, అతని పక్కనే ఉన్న మరో యువకుడు విగతజీవిగా మారినట్లు తెలిపాడు. ప్రమాదాలను నివారించడానికి ట్రాఫిక్ నియమాలు కట్టుబడి ఉండాలని నియమాలు మరియు నిబంధనలు కట్టుబడి ప్రజలు ఉండాలని పోలీసులు కోరారు, ముఖ్యంగా యువకులకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వరాదని వారిని నియంత్రించాలని సలహా ఇచ్చారు.ప్రమాదాలను నివారించడానికి ట్రాఫిక్ నియమాలు కట్టుబడి ఉండాలని షార్జా పోలీస్ ట్రాఫిక్ సూచించారు.
తాజా వార్తలు
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!







