కరెంటు సరఫరా ప్రై’వేటు’!
- October 16, 2025
హైదరాబాద్: విద్యుత్ రంగంలో పెద్ద మార్పును కేంద్రం తీసుకొస్తోంది.ఒకే ప్రాంతంలో బహుళ విద్యుత్ పంపిణీ సంస్థలను (డిస్కమ్స్) ప్రతిపాదించాలని నిర్ణయించింది. ప్రభుత్వ డిస్కంలకు పోటీగా ప్రైవేటుకు దారాదత్తం చేసేందుకు సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో నడిచే డిస్కంలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడిని అధిగమించడంతో పాటు, వాటిని పరిష్కరించడానికి, సమర్థవంతమైన వనరుల వినియోగం, మెరుగైన సేవా నాణ్యతను అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు దీనికి సంబంధించి కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ విద్యుత్ చట్టానికి సవరణ ముసాయిదాను విడుదల చేసింది. ఈ ముసాయిదాను తాజాగా రాష్ట్రాల అభిప్రాయానికి పంపించింది. దీని ప్రకారం పస్తుత విద్యుత్ పంపిణీ మౌళిక సదుపాయాలను ఉపయోగించి ఒకే ప్రాంతంలో బహుళ పంపిణీ సంస్థలను (డిస్కమ్‌లు) పనిచేయడానికి అనుమతిస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే డిస్కమ్‌లు ఆధిపత్యం చెలాయించే ఈ రంగాన్ని ప్రైవేట్ భాగస్వామ్యం మరియు పోటీకి తెరవడం ఈ మార్పుల లక్ష్యంగా ముసాయిదా చట్టం వెల్లడించింది. ఈ ముసాయిదాను జారీ చేసిన తేదీ నుండి 30 రోజుల్లోపు అభిప్రాయాన్ని తెలియచేయాలని సూచించింది.
ప్రస్తుతం దేశంలో దాదాపు 67 డిస్కమ్‌లు ఉన్నాయి, వాటిలో 16 ఢిల్లీ, ముంబై, ఒడిశా, పశ్చిమ బెంగాల్, గుజరాత్ మరియు దాద్రా నాగర్ హవేలి వంటి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రైవేట్‌గా నడుస్తున్నాయి. టాటా పవర్, అదానీ గ్రూప్, టోరెంట్ పవర్, సంజీవ్ గోయెంకా గ్రూప్ వంటి ప్రైవేట్ కంపెనీలు కీలక ఆపరేటర్లలో ఉన్నాయి. ఇకన “విద్యుత్ (సవరణ) బిల్లు 2025 ముసాయిదా ప్రకారం, ప్రతిపాదిత మార్పులు ఇప్పటికే ఉన్న పంపిణీ నెట్‌వర్క్‌లకు వివక్షత లేని ఓపెన్ యాక్సెస్‌ను స్పష్టంగా తప్పనిసరి చేస్తాయి. దీనివల్ల బహుళ సరఫరాదారులు ఒకే మౌళిక సదుపాయాలను సమర్థవంతంగా ఉపయోగించుకునే అవకాశం లభిస్తుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి, ప్రతిపాదిత సవరణ ఇప్పటికే ఉన్న పంపిణీ నెట్వర్కు వివక్షత లేని ఓపెన్ యాక్సెస్‌ను స్పష్టంగా తప్పనిసరి చేస్తుంది. ఇది బహుళ సరఫరాదారులు ఈ మోలిక సదుపాయాలను సమర్థవంతంగా ఉపయోగించుకోగలరని, రిడెండెన్సీని తొలగిస్తుందని మరియు ఇందుకయ్యే ఖర్చులను తగ్గించగలరని నిర్ధారిస్తుంది“ అని ముసాయిదా పేర్కొంది.
ప్రస్తుత చట్టం అదే ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వ డిస్కలకు సమాంతరంగా సొంత పంపిణీ నెట్వర్స్ను నిర్మించుకుంటేనే ప్రైవేటు లైసెన్సుదారులను అనుమతిస్తుందని స్పష్టం చేసింది. ఈ కొత్త ప్రతిపాదనతో ప్రైవేట్ కంపెనీలు విద్యుత్ సరఫరా చేయడానికి ఇప్పటికే ఉన్న రాష్ట్ర మోలిక సదుపాయాలను ఉపయోగించుకునే వీలును కల్పిస్తుంది. 2022లో కూడా ఇలాంటి ప్రయత్నం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు మరియు విద్యుత్ రంగ ఉద్యోగి సంఘాల నుండి వ్యతిరేకత రావడంతో దానిని పక్కన పెట్టారు. అయితే మళ్లీ దీన్ని కేంద్రం తెరముందుకు తీసుకొచ్చింది. వనరుల వినియోగాన్ని ఆప్టిమైజ్ చేయడానికి, సేవా నాణ్యతను మెరుగుపరచడానికి మరియు తుది వినియోగదారులకు మరింత సరసమైన మరియు నమ్మదగిన విద్యుత్తును అందించడంలో దోహదపడుతుందని ఇంధన మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- విశాఖలో రూ.1,222 కోట్లతో లులు ప్రాజెక్టు
- సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు పోలీసులు వార్నింగ్
- రాధిక తుమ్మలకు ‘లీడ్ ఇండియా అబ్దుల్ కలామ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం’ ప్రదానం
- భారత్‌లో మళ్లీ భారీ క్రీడా వేడుక
- శంషాబాద్: ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం స్వాధీనం
- స్మృతి మంధాన, అభిషేక్ శర్మకు ఐసీసీ అవార్డు
- సీఎం తప్ప, మిగతా మంత్రుల రాజీనామా
- దేశానికి మోడీ దొరికిన ఆణిముత్యం: సీఎం చంద్రబాబు
- నిమిష ప్రియకేసులో తాజా అప్డేట్
- జాయెద్ నేషనల్ మ్యూజియం డిసెంబర్ 3న ప్రారంభం..!!