2026లో ఖతార్ GDP 6% పైగా పెరుగుతుంది: IMF

- October 16, 2025 , by Maagulf
2026లో ఖతార్ GDP 6% పైగా పెరుగుతుంది: IMF

దోహా: ఖతార్ వాస్తవ GDP వృద్ధి ఈ సంవత్సరం 2.9% మరియు 2026లో 6.1% ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) తెలిపింది. IMF మరియు ప్రపంచ బ్యాంకు గ్రూప్ వార్షిక సమావేశాల సందర్భంగా తన ప్రపంచ ఆర్థిక ఔట్‌లుక్‌లో ఈ మేరకు వెల్లడించింది.

ఖతార్ కరెంట్ ఖాతా బ్యాలెన్స్ ఈ సంవత్సరం 10.8% మరియు 2026లో 10.2% ఉంటుందని అంచనా వేయగా, వినియోగదారుల ధరలు ఈ సంవత్సరం 0.1% మరియు 2026లో 2.6% ఉంటుందని పేర్కొంది.

 ఖతార్ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని, అధిక తలసరి ఆదాయం, విస్తారమైన హైడ్రోకార్బన్ నిల్వలు మరియు బలమైన ఆర్థిక ఫండమెంటల్స్ దాని బలమైన క్రెడిట్ ప్రొఫైల్‌కు మద్దతు ఇస్తున్నాయని వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com