ఖతార్ లో పుంజుకున్న రెసిడెన్షియల్ రెంటల్ మార్కెట్..!!
- October 17, 2025
దోహా: ఖతార్ లో రెసిడెన్షియల్ రెంటల్ మార్కెట్ రికవరీ అవుతోంది. ఈ మేరకు ఖతార్ రెసిడెన్షియల్ రెంటల్ మార్కెట్ క్యూ3 2025 నివేదిక వెల్లడించింది. ప్రధాన ఏరియాల్లో లీజింగ్ కార్యకలాపాలు వేగవంతం అవుతున్నాయని, కొన్ని ముఖ్యమైన ప్రాంతాలలో సగటు అద్దెలు ఎక్కువగా నమోదు అవుతున్నట్లు నివేదిక పేర్కొంది.
గత సంవత్సరంలో అపార్ట్‌మెంట్ మరియు విల్లా మార్కెట్లు రెండూ ఊపందుకున్నాయని టాటామి సహ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ ఐమెన్ బెడావి తెలిపారు. లుసైల్ మరియు మషీరెబ్ వంటి అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో లీజింగ్ కార్యకలాపాలు వేగంగా వృద్ధి చెందుతున్నదని పేర్కొన్నారు. అదే సమయంలో చిన్న, మెరుగైన నిర్వహణ కలిగిన అపార్ట్‌మెంట్‌లు మరియు సబర్బన్ కమ్యూనిటీల వైపు అనేక మంది ప్రధాన్యత ఇస్తున్నారని తెలిపారు.
ది పెర్ల్ అద్దెదారులకు అగ్ర గమ్యస్థానంగా నిలిచింది. తరువాత అల్ సద్ద్, మషీరెబ్ మరియు ఫెరీజ్ బిన్ మహమూద్ ప్రాంతాలు ఉన్నాయి. అయితే, లుసైల్ ఉత్తమ నివాస స్థలంగా పేర్కొనగా.. ఫాక్స్ హిల్స్ లీజింగ్ పరిమాణంలో 81 శాతం పెరుగుదలను నమోదు చేసిందని తెలిపారు. లుసైల్ మరియు మషీరెబ్‌లలో సగటు అపార్ట్‌మెంట్ అద్దెలు వరుసగా 9.8 శాతం మరియు 3.5 శాతం పెరిగాయని పేర్కొన్నారు.
దోహా మునిసిపాలిటీ వెలుపల ముఖ్యంగా ఉమ్ స్లాల్ మరియు అల్ రయాన్‌లలో విల్లాలకు డిమాండ్ పెరుగుతున్నదని తెలిపింది. ఇక అద్దె లావాదేవీలలో మురైఖ్ 84 శాతం పెరుగుదలతో, అల్ తుమామా (+42 శాతం), అల్ ఘర్రఫా (+33 శాతం), అల్ వుకైర్ (+30 శాతం) ఉన్నారు. మెరుగైన రోడ్ నెట్‌వర్క్‌లు, పాఠశాలు, దోహా ఉపాధి కారిడార్‌లకు కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో ఏరియాల్లో రెంటల్ మార్కెట్ కు డిమాండ్ క్రమంగా పెరుగుతోందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఎన్ఆర్ఐలకు డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఉన్నత విద్యకు ప్రత్యేక అవకాశాలు
- తెలంగాణలో బతుకమ్మ సందడి..
- మెన్స్ హాకీ ఫైనల్లో భారత్ ఘన విజయం
- ఫ్లై దుబాయ్ పైలట్ స్మిత్ మచ్ఛర్‌ను పరామర్శించిన షేక్ హమ్దాన్దు
- బహ్రెయిన్ అంతర్జాతీయ మ్యూజిక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- యూఏఈలో ట్రక్కుల సేవలు, ఫుడ్ డెలివరీ ఛార్జీలు పెరుగుతాయా?
- మక్కా గ్రాండ్ మసీదులో సూసైడ్ బాంబర్ ప్రచారం ఫేక్..!!
- హత్య కేసు ఆధారాలు చెరిపేసే ప్రయత్నం.. వ్యక్తి డిపోర్టేషన్..!!
- డుక్మ్ స్పేస్‌పోర్ట్.. ‘అజాద్ డ్రీమర్’ రాకెట్ ప్రయోగం సక్సెస్..!!
- హార్ముజ్ జలసంధిలో రెండు చమురు ట్యాంకర్లపై దాడి..!!







