తిరుమల లడ్డూ ధర పెంపు వార్తలు అవాస్తవం: బీఆర్ నాయుడు

- October 17, 2025 , by Maagulf
తిరుమల లడ్డూ ధర పెంపు వార్తలు అవాస్తవం: బీఆర్ నాయుడు

తిరుమల శ్రీవారి లడ్డూ ధరలు పెంచుతున్నారని సోషల్ మీడియా, కొన్ని వార్తా సంస్థలలో ప్రచారం జరుగుతుండటంపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఘాటుగా స్పందించారు. లడ్డూ ధరల పెంపుపై వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని, ఎటువంటి నిర్ణయం టీటీడీ తీసుకోలేదని స్పష్టం చేశారు. బీఆర్ నాయుడు మాట్లాడుతూ, “శ్రీవారి లడ్డూ భక్తుల విశ్వాసానికి ప్రతీక. దాని ధరను పెంచే ఆలోచన టీటీడీ వద్ద లేదు. ఇటువంటి తప్పుడు ప్రచారాలు భక్తుల్లో అపోహలు సృష్టించడమే లక్ష్యంగా చేస్తున్నాయి” అని తెలిపారు.

కొన్ని మీడియా సంస్థలు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయని ఆయన విమర్శించారు. “టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే కొందరు ఇలాంటి కథనాలను ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి అసత్య ప్రచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం” అని బీఆర్ నాయుడు పేర్కొన్నారు. భక్తులు ఈ వదంతులను నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. “తిరుపతి లడ్డూ ధర భవిష్యత్తులో కూడా యథాతథంగానే ఉంటుంది. శ్రీవారి ప్రసాదం ఎప్పటికీ భక్తులందరికీ అందుబాటులో ఉండేలా టీటీడీ కట్టుబడి ఉంటుంది” అని ఆయన పునరుద్ఘాటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com