బహ్రెయిన్ పోస్ట్ మొబైల్ పోస్టల్ సేవలు ప్రారంభం..!!

- October 19, 2025 , by Maagulf
బహ్రెయిన్ పోస్ట్ మొబైల్ పోస్టల్ సేవలు ప్రారంభం..!!

మనామా: బహ్రెయిన్ పోస్ట్ అధికారికంగా తన కొత్త మొబైల్ పోస్టల్ సేవల ప్రాజెక్టును ప్రారంభించింది. ఇది అన్ని గవర్నరేట్‌లలోని ప్రజలకు పోస్టల్ సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ఉపయోగపడుతుందని తెలిపింది. 

పోస్టాఫీసులను సందర్శించకుండానే పోస్టల్ లావాదేవీలను పూర్తి చేయడానికి కొత్త సేవ వీలు కల్పిస్తుందని పేర్కొంది. ఆధునిక వ్యవస్థలతో కూడిన మొబైల్ యూనిట్లు ఇప్పుడు వివిధ ప్రదేశాలకు నేరుగా పోస్టల్ సేవలను అందిస్తాయని వెల్లడించింది.  

కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడంలో మరియు బహ్రెయిన్ పోస్టల్ మౌలిక సదుపాయాలను ఆధునీకరించడంలో ఈ ప్రాజెక్ట్ ఒక ముఖ్యమైన ముందడుగు అని పోస్టల్ వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ డాక్టర్ ఖలీద్ అబ్దుల్‌రహ్మాన్ అల్ హైదాన్ అన్నారు.  ఈ ప్రాజెక్ట్ బహ్రెయిన్ పోస్ట్ సేవలను విస్తరించడానికి, వ్యక్తులు మరియు సంస్థలకు సులువుగా సేవలు అందించే ప్రణాళికలో భాగమని ఆయన అన్నారు.

ఇక ఈ మొబైల్ పోస్టల్ సర్వీస్ శనివారం నుండి గురువారం వరకు ప్రతిరోజూ ఉదయం 7:00 నుండి సాయంత్రం 7:00 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు కస్టమర్ కాంటాక్ట్ సెంటర్ 80001100  ద్వారా లేదా వెబ్ సైట్ లో అపాయింట్‌మెంట్‌లను బుక్ చేసుకోవచ్చని ప్రకటించారు.      

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com