నవంబర్ 14, 15న సీఐఐ భాగస్వామ్య సదస్సు–ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు సమీక్ష
- October 19, 2025
అమరావతి: విశాఖపట్నంలో నవంబర్ 14, 15 తేదీల్లో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లపై ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, పరిశ్రమల శాఖ, ఈడీబీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ ప్రతినిధులు, మరియు వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. విశాఖలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే ఈ భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దేశ-విదేశాల్లోని పలు నగరాల్లో రోడ్‌షోలు నిర్వహించి, విశాఖ పెట్టుబడుల సదస్సుకు పునాది వేసింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పారిశ్రామిక వేత్తలకు సదస్సులో పాల్గొనాలని ఆహ్వానం పలికారు.
సదస్సుకు కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పాలసీ మేకర్లును కూడా ఆహ్వానించాలని సీఎం సూచించారు. రాష్ట్రానికి పెట్టుబడులు మాత్రమే కాకుండా నాలెడ్జ్ షేరింగ్, లాజిస్టిక్స్, టెక్నాలజీ వంటి రంగాల్లో విధానాలపై ఉన్నత స్థాయి చర్చలకు ఈ సదస్సు వేదిక కావాలన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న మార్పులను అందిపుచ్చుకుని, వాటిని అవకాశాలుగా మార్చుకునేలా సదస్సు నిర్వహణ ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- గిన్నిస్ రికార్డుకు సిద్ధమవుతున్న అయోధ్య!
- కువైట్ లో ది లీడర్స్ కాన్క్లేవ్..!!
- సౌదీలో 23,094 మంది అరెస్టు..!!
- బహ్రెయిన్ లో మెసేజ్ స్కామ్స్ పెరుగుదల..!!
- ప్రపంచ శాంతికి ఖతార్ కృషి..!!
- బర్నింగ్ డాల్ ట్రెండ్ పై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- ROHM లో స్టార్ డయానా హద్దాద్ కాన్సర్ట్..!!
- దోహా చర్చలతో పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ శాంతి ఒప్పందం
- శంకర నేత్రాలయ USA తమ 'అడాప్ట్-ఎ-విలేజ్' దాతలకు అందిస్తున్న ఘన సత్కారం
- నవంబర్ 14, 15న సీఐఐ భాగస్వామ్య సదస్సు–ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు సమీక్ష