బర్నింగ్ డాల్ ట్రెండ్ పై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- October 19, 2025
దుబాయ్: దుబాయ్ లో ఇటీవల దయ్యం బొమ్మలను కాల్చే ట్రెండ్ ఒకటి సోషల్ మీడియాలో వైరలవ్ అవుతోంది. దీనిపై దుబాయ్ పోలీసులు ప్రజలను హెచ్చరించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న వీడియోలు తీవ్రమైన ప్రమాదాలను కలిగిస్తున్నాయని, ప్లాస్టిక్, ఫాబ్రిక్ లేదా సింథటిక్ జుట్టు వంటి మండే పదార్థాలను కాల్చడం వల్ల మంటలు చెలరేగే ప్రమాదం ఉందని, అలాగే విషపూరితమైన పొగ విడుదల అవుతుందని, దీనిని పీల్చడం ద్వారా మనుషులలో తీవ్రమైన పరిణామాలకు దారీతీయవచ్చని పోలీసులు తెలిపారు.
పిల్లల ఆన్‌లైన్ కార్యకలాపాలను నిశితంగా గమనించాలని, అలాంటి నివీడియోల ద్వారా జరిగే ప్రమాదాల గురించి వారితో మాట్లాడాలని తల్లిదండ్రులకు పోలీసులు సూచించారు. ప్రమాదకరమైన కంటెంట్‌ను షేర్ చేయడం అనేది యూఏఈలో చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరమని, ఎందుకంటే ఇది ప్రాణాలకు మరియు ఆస్తికి హాని కలిగిస్తుందని పోలీసులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- గిన్నిస్ రికార్డుకు సిద్ధమవుతున్న అయోధ్య!
- కువైట్ లో ది లీడర్స్ కాన్క్లేవ్..!!
- సౌదీలో 23,094 మంది అరెస్టు..!!
- బహ్రెయిన్ లో మెసేజ్ స్కామ్స్ పెరుగుదల..!!
- ప్రపంచ శాంతికి ఖతార్ కృషి..!!
- బర్నింగ్ డాల్ ట్రెండ్ పై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- ROHM లో స్టార్ డయానా హద్దాద్ కాన్సర్ట్..!!
- దోహా చర్చలతో పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ శాంతి ఒప్పందం
- శంకర నేత్రాలయ USA తమ 'అడాప్ట్-ఎ-విలేజ్' దాతలకు అందిస్తున్న ఘన సత్కారం
- నవంబర్ 14, 15న సీఐఐ భాగస్వామ్య సదస్సు–ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు సమీక్ష