ప్రపంచ శాంతికి ఖతార్ కృషి..!!
- October 19, 2025
బెర్లిన్: జర్మనీలోని ఖతార్ రాయబార కార్యాలయంలో “బిల్డింగ్ బ్రిడ్జెస్: ఖతార్ అండ్ జర్మనీ ఇన్ డైలాగ్ ఫర్ టాలరెన్స్, పీస్ అండ్ సాలిడారిటీ” అనే సింపోజియం జరిగింది. ఇందులో ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ (MoFA) సెక్రటరీ జనరల్ డాక్టర్ అహ్మద్ బిన్ హసన్ అల్ హమ్మది, జర్మన్ పార్లమెంట్ సభ్యుడు మరియు బెర్లిన్ మాజీ మేయర్ మైఖేల్ ముల్లర్ పాల్గొన్నారు. వీరితోపాటు రెండు దేశాలకు చెందిన మేధావులు, ప్రొఫెసర్లు హాజరయ్యారు.
ఒకరినొకరు తెలుసుకోవటానికి, పరస్పర గౌరవాన్ని ప్రోత్సహించడానికి మరియు అంతర్జాతీయ శాంతిని సాధించడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని అల్ హమ్మది అన్నారు. ఈ సందర్భంగా 2025-2026లో ఖతార్ గ్లోబల్ అవార్డు ఫర్ డైలాగ్ అమాంగ్ సివిలైజేషన్స్ ఐదవ ఎడిషన్ను ప్రారంభించినట్లు ప్రకటించారు.
అనంతరం బెర్లిన్లో జర్మనీ ఫెడరల్ విదేశాంగ కార్యాలయ విదేశాంగ కార్యదర్శి డాక్టర్ గెజా ఆండ్రియాస్ వాన్ గేయర్తో సమావేశమయ్యారు. వారు రెండు దేశాల మధ్య సహకారం మరియు సంబంధాలు, పరస్పర ఆసక్తి ఉన్న అనేక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో జర్మనీలోని ఖతార్ రాయబారి అబ్దుల్లా బిన్ ఇబ్రహీం అల్ హమార్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- నిరుద్యోగులకు సీఎం రేవంత్ శుభవార్త
- టీ20 ప్రపంచకప్కి టీమిండియా జెర్సీ విడుదల
- హైదరాబాద్ నడిబొడ్డు నుంచి ఎక్స్ప్రెస్ వే..
- WTITC: గ్లోబల్ స్టూడెంట్ ఇన్నోవేషన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్
- యూఏఈలో ఫేక్ ఇన్వెస్టర్లు..ఇన్వెస్టర్లకు హెచ్చరిక..!!
- గాయపడ్డ ఆసియా ప్రవాసి ఎయిర్ లిఫ్ట్..!!
- పౌరుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధానం: క్రౌన్ ప్రిన్స్
- ఖతార్ మ్యూజిమ్స్ లో సాంస్కృతిక, క్రియేటివిటీ ఈవెంట్లు..!!
- బహ్రెయిన్-ఇటలీ సంబంధాలు బలోపేతం..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డ్ సార్థక్..!!







