సౌదీలో 23,094 మంది అరెస్టు..!!
- October 19, 2025
రియాద్: సౌదీ భద్రతా అధికారులు గత వారంలో మొత్తం 23,094 మంది అక్రమ నివాసితులను అరెస్టు చేశారు. అక్టోబర్ 9 మరియు అక్టోబర్ 15 మధ్య సంబంధిత ప్రభుత్వ సంస్థల సహకారంతో ఈ అరెస్టులు చేసినట్టు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అరెస్టు చేయబడిన వారిలో 13,604 మంది నివాస చట్టాలు, 4,816 మంది సరిహద్దు చట్టాలు, 4,674 మంది కార్మిక చట్టాలను ఉల్లంఘించినవారు ఉన్నారు. సౌదీలోకి అక్రమంగా వస్తున్న 2,061 మంది అరెస్టు చేయగా, వీరిలో 43 శాతం యెమెన్ జాతీయులు, 56 శాతం ఇథియోపియన్ జాతీయులు ఉన్నారు.
చట్టాలను ఉల్లంఘించే వారికి సహకరించే వారికి 15 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు SR1 మిలియన్ వరకు జరిమానా విధిస్తారు. వారి వాహనాలను సీజ్ చేస్తామని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. మక్కా, రియాద్ మరియు తూర్పు ప్రావిన్స్ ప్రాంతాలలో 911 నంబర్కు, ఇతర ప్రాంతాలలో 999 మరియు 996 నంబర్లకు కాల్ చేయడం ద్వారా ఉల్లంఘన కేసులను నివేదించాలని మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- గిన్నిస్ రికార్డుకు సిద్ధమవుతున్న అయోధ్య!
- కువైట్ లో ది లీడర్స్ కాన్క్లేవ్..!!
- సౌదీలో 23,094 మంది అరెస్టు..!!
- బహ్రెయిన్ లో మెసేజ్ స్కామ్స్ పెరుగుదల..!!
- ప్రపంచ శాంతికి ఖతార్ కృషి..!!
- బర్నింగ్ డాల్ ట్రెండ్ పై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- ROHM లో స్టార్ డయానా హద్దాద్ కాన్సర్ట్..!!
- దోహా చర్చలతో పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ శాంతి ఒప్పందం
- శంకర నేత్రాలయ USA తమ 'అడాప్ట్-ఎ-విలేజ్' దాతలకు అందిస్తున్న ఘన సత్కారం
- నవంబర్ 14, 15న సీఐఐ భాగస్వామ్య సదస్సు–ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు సమీక్ష