బహ్రెయిన్ లో మెసేజ్ స్కామ్స్ పెరుగుదల..!!
- October 19, 2025
మనామా: బహ్రెయిన్ లో అధికారిక సంస్థల పేరిట టెక్స్ట్ మెసేజ్‌ల ద్వారా సైబర్ నేరాల సంఖ్య పెరుగుతోంది. ఈ మేరకు జాతీయ సైబర్ భద్రతా కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. స్కామర్లు ఫీజులు చెల్లించేలా లేదా వ్యక్తిగత బ్యాంకింగ్ సమాచారాన్ని సేకరించి మోసగిస్తున్నట్లు నివేదించారు.
ఈ మోసపూరిత మెసేజులు తరచుగా అధికారిక వెబ్‌సైట్‌లను పోలి ఉండేలా రూపొందించే నకిలీ లింక్‌లను కలిగి ఉంటాయని, ఇవి సున్నితమైన సమాచారాన్ని దొంగిలించడం లేదా బ్యాంక్ ఖాతాల సమాచారం సేకరణ లక్ష్యంగా ఉంటాయని తెలిపారు. అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దని అధికారులు సూచించారు. ప్రభుత్వ సంస్థలు ఎప్పుడూ టెక్స్ట్ మెసేజ్‌ల ద్వారా వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ సమాచారాన్ని కోరవని జాతీయ సైబర్ భద్రతా కేంద్రం స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?
- 2025లో ఖతార్ లో 3% పెరిగిన ప్యాసింజర్స్..!!







