ప్రపంచ శాంతికి ఖతార్ కృషి..!!

- October 19, 2025 , by Maagulf
ప్రపంచ శాంతికి ఖతార్ కృషి..!!

బెర్లిన్: జర్మనీలోని ఖతార్ రాయబార కార్యాలయంలో “బిల్డింగ్ బ్రిడ్జెస్: ఖతార్ అండ్ జర్మనీ ఇన్ డైలాగ్ ఫర్ టాలరెన్స్, పీస్ అండ్ సాలిడారిటీ” అనే సింపోజియం జరిగింది. ఇందులో ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ (MoFA) సెక్రటరీ జనరల్ డాక్టర్ అహ్మద్ బిన్ హసన్ అల్ హమ్మది, జర్మన్ పార్లమెంట్ సభ్యుడు మరియు బెర్లిన్ మాజీ మేయర్ మైఖేల్ ముల్లర్ పాల్గొన్నారు. వీరితోపాటు రెండు దేశాలకు చెందిన మేధావులు, ప్రొఫెసర్లు హాజరయ్యారు.

ఒకరినొకరు తెలుసుకోవటానికి, పరస్పర గౌరవాన్ని ప్రోత్సహించడానికి మరియు అంతర్జాతీయ శాంతిని సాధించడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని అల్ హమ్మది అన్నారు. ఈ సందర్భంగా 2025-2026లో ఖతార్ గ్లోబల్ అవార్డు ఫర్ డైలాగ్ అమాంగ్ సివిలైజేషన్స్ ఐదవ ఎడిషన్‌ను ప్రారంభించినట్లు ప్రకటించారు.  

అనంతరం బెర్లిన్‌లో జర్మనీ ఫెడరల్ విదేశాంగ కార్యాలయ విదేశాంగ కార్యదర్శి డాక్టర్ గెజా ఆండ్రియాస్ వాన్ గేయర్‌తో సమావేశమయ్యారు. వారు రెండు దేశాల మధ్య సహకారం మరియు సంబంధాలు, పరస్పర ఆసక్తి ఉన్న అనేక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో జర్మనీలోని ఖతార్ రాయబారి అబ్దుల్లా బిన్ ఇబ్రహీం అల్ హమార్ పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com