కువైట్ లో ది లీడర్స్ కాన్క్లేవ్..!!
- October 19, 2025
కువైట్: ది లీడర్స్ కాన్క్లేవ్ను ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ కువైట్ (ICSK ) నిర్వహించింది. కువైట్‌లోని 24 CBSE-అనుబంధ పాఠశాలల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. ఈ సమావేశానికి దుబాయ్‌లోని CBSE ప్రాంతీయ కార్యాలయం మరియు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రొఫెసర్ డాక్టర్ రామ్ శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం రెండవ కార్యదర్శి బైజా నాథ్ ప్రసాద్ గౌరవ అతిథిగా హాజరయ్యారు.
నవంబర్ 4–5వ తేదీల్లో దుబాయ్‌లోని గ్రాండ్ హయత్ హోటల్లో జరగనున్న రాబోయే CBSE ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ గురించి సమావేశంలో చర్చించారు. కువైట్‌లోని భారతీయ పాఠశాలల కృషిని ప్రశంసించారు. భారతీయ విద్యా వ్యవస్థ ప్రాముఖ్యతను వివరించారు. దుబాయ్‌లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా విద్యావేత్తల వృత్తిపరమైన సామర్థ్యాలను పెంపొందించడానికి మరియు ఇన్-సర్వీస్ టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లను ప్రారంభించినట్లు డాక్టర్ శంకర్ వెల్లడించారు.
తాజా వార్తలు
- గిన్నిస్ రికార్డుకు సిద్ధమవుతున్న అయోధ్య!
- కువైట్ లో ది లీడర్స్ కాన్క్లేవ్..!!
- సౌదీలో 23,094 మంది అరెస్టు..!!
- బహ్రెయిన్ లో మెసేజ్ స్కామ్స్ పెరుగుదల..!!
- ప్రపంచ శాంతికి ఖతార్ కృషి..!!
- బర్నింగ్ డాల్ ట్రెండ్ పై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- ROHM లో స్టార్ డయానా హద్దాద్ కాన్సర్ట్..!!
- దోహా చర్చలతో పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ శాంతి ఒప్పందం
- శంకర నేత్రాలయ USA తమ 'అడాప్ట్-ఎ-విలేజ్' దాతలకు అందిస్తున్న ఘన సత్కారం
- నవంబర్ 14, 15న సీఐఐ భాగస్వామ్య సదస్సు–ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు సమీక్ష