ప్రభాస్ హను ప్రీ-లుక్ రిలీజ్, రేపు టైటిల్ పోస్టర్ రిలీజ్
- October 22, 2025
వరుస పాన్ ఇండియా బ్లాక్బస్టర్లతో దూసుకుపోతున్న రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో బిగ్గెస్ట్ పాన్ ఇండియా వెంచర్లో నటిస్తున్నారు. ప్రఖ్యాత పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. టి సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పిస్తున్నారు. ప్రభాస్ రేపు తన పుట్టినరోజును జరుపుకోవడానికి సిద్ధమవుతుండగా, మేకర్స్ అభిమానుల కోసం ఒక ప్రత్యేక సర్ప్రైజ్ను సిద్ధం చేశారు. టైటిల్ పోస్టర్‌ను రివిల్ చేయనున్నారు. ప్రీ-లుక్ పోస్టర్‌ను ఈరోజు విడుదల చేశారు.
ప్రీ-లుక్ పోస్టర్ ఒక మిస్టీరియస్, ఇన్టెన్స్ వాతావరణాన్ని ప్రజెంట్ చేస్తోంది. బ్రిటిష్ పాలన కాలంలో నడిచే ఒక ఎపిక్ హిస్టారికల్ డ్రామాకు టోన్ సెట్ చేస్తోంది. పోస్టర్లో ప్రభాస్ లాంగ్ కోట్, బూట్స్ వేసుకుని, ఒక కాలు మరో కాలిపై వేసుకుని నిలబడి ఉన్నట్లు కనిపించారు. వెనుక గోడపై కనిపించే సైనికుల సిల్హౌట్స్ యుద్ధం, తిరుగుబాటు వాతావరణాన్ని చూపిస్తున్నాయి.
“A Battalion Who Walks Alone”, “Most Wanted Since 1932” పోస్టర్‌పై ఉన్న ఈ వాక్యాలు ప్రభాస్ పవర్ ఫుల్ పాత్రని సూచిస్తున్నాయి. బ్యాక్ డ్రాప్ లో యూనియన్ జాక్ జెండా బ్రిటిష్ పాలనా కాలాన్ని గుర్తు చేస్తుంది. పోస్టర్లో ఉన్న భగవద్గీత శ్లోకాలు ఈ కథకు ఫిలాషఫికల్ డెప్త్ ని యాడ్ చేస్తున్నాయి.
ప్రభాస్ సరసన హీరోయిన్గా ఇమాన్వీ నటిస్తోంది. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, భాను చందర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్రాన్ని నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ లు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీమ్ పనిచేస్తోంది. సినిమాటోగ్రఫీని సుదీప్ చటర్జీ (ISC) నిర్వహిస్తుండగా, సంగీతాన్ని విషాల్ చంద్రశేఖర్ అందిస్తున్నారు. అనిల్ విలాస్ జాధవ్ ప్రొడక్షన్ డిజైనర్, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్.
ప్రీ-లుక్ పోస్టర్ చాలా ఎక్సయిట్మెంట్ ని పెంచింది, ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా రేపు విడుదల కానున్న టైటిల్ పోస్టర్ కోసం అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
తారాగణం: ప్రభాస్, ఇమాన్వి, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద, భాను చందర్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: హను రాఘవపూడి
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
సహ నిర్మాత (T-సిరీస్) : శివ చనన
ప్రెసిడెంట్ (టి-సిరీస్) : నీరజ్ కళ్యాణ్
DOP: సుదీప్ ఛటర్జీ ISC
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
ప్రొడక్షన్ డిజైనర్: అనిల్ విలాస్ జాదవ్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
సాహిత్యం: కృష్ణకాంత్
కొరియోగ్రాఫర్: ప్రేమ్ రక్షిత్
కాస్ట్యూమ్ డిజైనర్లు: శీతల్ ఇక్బాల్ శర్మ, టి విజయ్ భాస్కర్
VFX: RC కమల కన్నన్
పబ్లిసిటీ డిజైనర్లు: అనిల్-భాను
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
తాజా వార్తలు
- అబుదాబీలో సీఎం చంద్రబాబు పర్యటన
- సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- లాజిస్టిక్స్, గిడ్డంగుల ఏర్పాటుకు రాష్ట్రానికి రండి
- ఏపీలో షిప్ బిల్డింగ్ యూనిట్‌కి ట్రాన్స్ వరల్డ్ గ్రూప్‌కు ఆహ్వానం
- కువైట్ లో న్యూ ట్రాఫిక్ వయలేషన్..వెహికల్ సీజ్..!!
- ఫుజైరా చిల్డ్రన్స్ బుక్ ఫెయిర్ 2025 రిటర్న్స్..!!
- ట్రాఫిక్ అలెర్ట్.. కార్నిచ్‌లో రోడ్ మూసివేత..!!
- దీపావళి నాడు విషాదం..18 ఏళ్ల భారతీయ విద్యార్థి మృతి..!!
- హజ్, ఉమ్రా కాన్ఫరెన్స్, ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- ఇటలీ, సౌదీ మధ్య జ్యుడిషియల్ సహకారం..!!