దీపావళి నాడు విషాదం..18 ఏళ్ల భారతీయ విద్యార్థి మృతి..!!
- October 23, 2025
దుబాయ్: దుబాయ్ లో దీపావళి నాడు విషాధం చోటుచేసుకుంది. తన ఇంటి వెలుపల భారతీయ యువకుడు హఠాత్తుగా మరణించాడు. అత్యుత్తమ భారతీయ ప్రవాస విద్యార్థి మరియు ప్రతిష్టాత్మక యూఏఈ గోల్డెన్ వీసా గ్రహీత అయిన వైష్ణవ్ మంగళవారం సాయంత్రం తన ఇంటి వెలుపల కన్నుమూశారు. అతని మరణానికి ప్రాథమిక కారణం కార్డియాక్ అరెస్ట్ అని అధికారులు తేల్చారు. అతను మిడిల్సెక్స్ యూనివర్శిటీ దుబాయ్‌లో మార్కెటింగ్‌లో BBA మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
18 ఏళ్ల అతను GEMS అవర్ ఓన్ ఇండియన్ స్కూల్ మాజీ విద్యార్థి. వైష్ణవ్ మృతికి పాఠశాల సంతాపం తెలిపింది. “మా మాజీ విద్యార్థి మరియు స్కూల్ కౌన్సిల్ మాజీ హెడ్, వైష్ణవ్ కృష్ణకుమార్ (2024-25 బ్యాచ్) గత రాత్రి హఠాత్తుగా మరణించాడు. ఆయన మృతికి తీవ్రంగా విచారం వ్యక్తం చేస్తున్నాము. అతని తల్లితండ్రులకు (అతని తల్లి విధు కృష్ణకుమార్, మా స్టీమ్ టీచర్) కు ప్రగాఢ సంతాపం.’’ అని తెలిపింది.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







