అబుదాబీలో సీఎం చంద్రబాబు పర్యటన
- October 23, 2025
దుబాయ్, అక్టోబరు 22: పెట్టుబడులు ఆకర్షించేందుకు దుబాయ్ యూఏఈలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు రెండోరోజు అబుదాబీలో పారిశ్రామికవేత్తలతో సమావేశంకానున్నారు. రేపు ఉదయం 10.15 నిముషాలకు దుబాయ్ నుంచి అబుదాబీ వెళ్లనున్న సీఎం అక్కడ అబుదాబీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ అహ్మద్ జైసిమ్ అల్ జాబీతో భేటీ కానున్నారు. అబుదాబీలోని అల్ మైరాహ్ ఐలాండ్ లో ఉన్న ఏడీజీఎ స్క్వేర్ లో ఈ సమావేశం జరుగనుంది. జీ 42 సీఈఓ మన్సూర్ అల్ మన్సూరీతోనూ సీఎం సమావేశం అవుతారు. అనంతరం అబుదాబీ నేషనల్ ఆయిల్ కంపెనీ ప్రతినిధులు అహ్మద్ బిన్ తలిత్, లాజిస్టిక్స్ విభాగం ప్రతినిధి అబ్దుల్ కరీమ్ అల్ మసాబీ, అదే సంస్థకు చెందిన రషీద్ అల్ మజ్రోయి, జాయేద్ అల్ షాయేయా, సయీద్ అల్ అమేరి తదితరులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. అనంతరం అబుదాబీలో స్థానిక టెక్నాలజీ కంపెనీల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనున్నారు. మధ్యాహ్నం అబుదాబీ పెట్టుబడుల విభాగం చైర్మన్ ఖలీఫా ఖౌరీతో సీఎం భేటీ అవుతారు. లులూ గ్రూప్ సీఎండీ యూసఫ్ అలీతోనూ ముఖ్యమంత్రి సమావేశమై విశాఖ, విజయవాడలో లులూ మాల్స్ నిర్మాణం, మల్లవల్లిలో లాజిస్టిక్స్ కేంద్రంపై చర్చించనున్నారు. ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ పార్కును ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనపరుస్తున్న అగితా గ్రూప్ సీఈఓ సల్మీన్ అల్మెరీతోనూ సీఎం భేటీ కానున్నారు.అబుదాబీలోని మస్దార్ సిటీ సీఈఓ మహ్మద్ జమీల్ అల్ రమాహితో భేటీ అవుతారు. అనంతరం యాస్ ఐ ల్యాండ్ లోని పర్యాటక ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై ఆ సంస్థ సీఈఓ మహ్మద్ అబ్దల్లా అల్ జాబీతో భేటీ కానున్నారు. ఈ భేటీ అనంతరం భారత కాన్సుల్ జనరల్ నివాసంలో ముఖ్యమంత్రి గౌరవార్ధం ఇచ్చే విందుకు చంద్రబాబు హాజరవుతారు. రేపు మొత్తం 9 సమావేశాలకు ముఖ్యమంత్రి హాజరుకానున్నారు.
తాజా వార్తలు
- ప్రతిష్ఠాత్మక గ్లోబల్ సదస్సుకు కెటిఆర్ కు ఆహ్వానం
- నకిలీ మద్యం మాఫియా పై వైఎస్ జగన్ సంచలన కామెంట్స్
- 5 లక్షల ఉద్యోగులకు అమెజాన్ లేఆఫ్‌లు
- అబుదాబీలో సీఎం చంద్రబాబు పర్యటన
- సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- లాజిస్టిక్స్, గిడ్డంగుల ఏర్పాటుకు రాష్ట్రానికి రండి
- ఏపీలో షిప్ బిల్డింగ్ యూనిట్‌కి ట్రాన్స్ వరల్డ్ గ్రూప్‌కు ఆహ్వానం
- కువైట్ లో న్యూ ట్రాఫిక్ వయలేషన్..వెహికల్ సీజ్..!!
- ఫుజైరా చిల్డ్రన్స్ బుక్ ఫెయిర్ 2025 రిటర్న్స్..!!
- ట్రాఫిక్ అలెర్ట్.. కార్నిచ్‌లో రోడ్ మూసివేత..!!







