సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొన్న సీఎం చంద్రబాబు

- October 23, 2025 , by Maagulf
సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
దుబాయ్: పెట్టుబడుల సాధనకు యూఏఈలో మూడు రోజుల పర్యటనలో భాగంగా తొలి రోజు సీఎం చంద్రబాబు వివిధ పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు.తొలి రోజు ఉత్సాహంగా పారిశ్రామిక వేత్తలతో భేటీలు నిర్వహించిన సీఎం చంద్రబాబు...ఏపీలో పెట్టుబడులకున్న అవకాశాలను వివరించడంతోపాటు వచ్చే నెల 14, 15 తేదీల్లో నిర్వహించనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు రావాల్సిందిగా ఆహ్వానించారు. తొలి రోజు సీఎం చంద్రబాబు 5వన్ టూ వన్ సమావేశాలు నిర్వహించారు.అనంతరం దుబాయ్ ఫ్యూచర్ మ్యూజియాన్ని మంత్రులు, అధికారులతో కలిసి  సందర్శించారు.ఏపీలో పెట్టబడులు పెట్టేందుకు యూఏఈ పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపించారు.అమరావతిలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో లైబ్రరీ నిర్మాణానికి శోభా గ్రూప్ రూ.100 కోట్లు విరాళం ప్రకటించింది.ఇక దుగరాజపట్నంలో షిప్ బిల్డింగ్ యూనిట్ నిర్మాణంలో భాగస్వాములు కావడానికి ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ సంస్థను సీఎం ఆహ్వానించారు. వైద్యారోగ్య రంగంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా బుర్జిల్ హెల్త్  కేర్ హోల్డింగ్స్ సంస్థ ముఖ్యమంత్రి కోరారు. ఈ మేరకు ఆ రెండు సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచాయి. ఈ వన్ టూ వన్ సమావేశాల్లో పలువురు యూఏఈ పారిశ్రామిక వేత్తలు సీఎం చంద్రబాబుతో ఉన్న అనుబంధాన్ని, గతాన్ని గుర్తు చేసుకున్నారు. వచ్చేనెల 14,15 తేదీల్లో విశాఖ వచ్చేందుకు ఆసక్తి చూపించారు. ముఖాముఖీ భేటీల్లో ఏపీలో గూగుల్ పెట్టుబడులపైనా చర్చ జరిగింది. బ్రేక్ లేకుండా వరుసగా మీటింగ్ లకు సీఎం అటెండ్ అయ్యారు.తొలి రోజు పర్యటనలో చివరిగా సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ రోడ్ షోలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com