'పెడల్ ఫర్ పింక్' సైక్లథాన్ కార్యక్రమం నిర్వహణ

- October 25, 2025 , by Maagulf
\'పెడల్ ఫర్ పింక్\' సైక్లథాన్ కార్యక్రమం నిర్వహణ

హైదరాబాద్: అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ (AOI), హైదరాబాద్ సైక్లిస్ట్స్ గ్రూప్ మరియు బైక్_ఓ_హోలిక్స్ సహకారంతో 'పెడల్ ఫర్ పింక్ 2025 సైక్లథాన్'ను విజయవంతంగా నిర్వహించింది. హైదరాబాద్ నలుమూలల నుండి సైక్లింగ్ కమ్యూనిటీలు, కార్పొరేట్‌లు మరియు స్థానిక సమూహాల సభ్యులు 300 మందికి పైగా సైక్లింగ్ ప్రియులు పాల్గొని రొమ్ము క్యాన్సర్ గురించి మరియు సకాలంలో గుర్తించాల్సిన ఆవశ్యకత గురించి అవగాహన పెంపొందించారు.

ఈ యొక్క సైక్లింగ్ ర్యాలీ AOI & సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి ప్రారంభమై, హైదరాబాద్ ఐటి కారిడార్ మీదగా విప్రో సర్కిల్ వరకు వెళ్లి తిరిగి హాస్పిటల్ చేరుకోవడం జరిగింది. *ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్టిస్ట్, ట్రైనర్ & ఆర్టిస్ట్‌ అయిన శ్రీమతి ధాస్యం గీతా భాస్కర్ గారు మరియు మాదాపూర్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (IPS)  శ్రీ రితి రాజ్ గారు* హాజరు అయ్యి మద్దతుగా సైక్లిస్టులతో కలిసి ప్రయాణించడం స్ఫూర్తిదాయకం.
భారతదేశంలో మహిళల ఆరోగ్య సమస్యలలో రొమ్ము క్యాన్సర్ అత్యంత ప్రధానమైనదిగా  ఇది మొత్తం క్యాన్సర్ కేసులలో 28.8% మహిళల్లో అత్యంత సాధారణ క్యాన్సర్‌గా నిలిచింది. నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ (National Cancer Registry Programme) ద్వారా JAMA ఓపెన్ నెట్‌వర్క్‌లో ఇటీవల ప్రచురించబడిన అధ్యయనంలో హైదరాబాద్ నగరంలో రొమ్ము క్యాన్సర్ సంభవం (Incidence) అత్యధికంగా ఉంది. ఇక్కడ ప్రతి 100,000 మంది మహిళలకు 54.0 చొప్పున వయస్సు-సర్దుబాటు సంభవం రేటు ((AAIR - Age-Adjusted Incidence Rate)) నమోదైంది. మారుతున్న జీవనశైలి, ఊబకాయం, నిశ్చల అలవాట్లు, మద్యపానం, ఆలస్యంగా ప్రసవం, త్వరగా రుతుస్రావం (early menarche), ఆలస్యంగా మెనోపాజ్ (late menopause) మరియు తల్లిపాలు ఇవ్వకపోవడం వంటి కారణాల వల్ల పట్టణ ప్రాంతాల్లో రొమ్ము క్యాన్సర్ పెరుగుతున్నట్లు సూచిస్తుంది.

ఈ సందర్భంగా, సీనియర్ కన్సల్టెంట్, మెడికల్ ఆంకాలజీ, డాక్టర్ కె.వి. కృష్ణమణి గారు ప్రసంగిస్తూ, రొమ్ము క్యాన్సర్‌ను ఎదుర్కోవడంలో ముందస్తు స్క్రీనింగ్ మరియు నివారణ చర్యల ప్రాధాన్యతను స్పష్టం చేశారు. ఆయన మాటల్లో: “రొమ్ము క్యాన్సర్‌కు సంబంధించిన కేసులలో సకాలంలో మరియు సమర్థవంతమైన చికిత్సకు ప్రారంభ దశలోనే వ్యాధిని నిర్ధారించడం అత్యంత కీలకమైన అంశం. హార్మోన్ల కారకాలు, మారుతున్న జీవనశైలి అలవాట్లు, అలాగే జన్యుపరమైన అంశాలు రొమ్ము క్యాన్సర్ సంభవాన్ని పెంచడానికి ప్రధాన కారణాలుగా గుర్తించబడ్డాయి. అయినప్పటికీ, నిరంతర వ్యాయామం, సమతుల్య ఆహారం మరియు మామోగ్రఫీ ద్వారా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం వంటి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అనుసరించడం ద్వారా ఈ క్యాన్సర్ ముప్పును గణనీయంగా తగ్గించవచ్చు.”

AOI ఈ సందర్భంగా పురుషులు, 40 ఏళ్లలోపు మహిళలు మరియు 40 ఏళ్లు పైబడిన మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన మూడు వేర్వేరు స్క్రీనింగ్ ప్యాకేజీలను కూడా ప్రారంభించింది. ఈ ప్యాకేజీలు స్క్రీనింగ్‌ను సులభంగా అందుబాటులోకి తీసుకురావడం మరియు త్వరగా వ్యాధిని గుర్తించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ముఖ్యంగా 40 ఏళ్లు పైబడిన మహిళలు క్రమం తప్పకుండా ఆరోగ్య తనిఖీలు మరియు మామోగ్రఫీ స్క్రీనింగ్‌లు చేయించుకోవాలని AOI సూచిస్తోంది.

"పెడల్ ఫర్ పింక్ సైక్లథాన్‌కు లభించిన అపారమైన ప్రజాదరణతో, ముందస్తు గుర్తింపు, ఆరోగ్యకరమైన జీవన విధానం, మరియు క్యాన్సర్ రహిత సమాజాల లక్ష్యాన్ని చేరుకోవడంలో మా నిబద్ధత మరింత దృఢపడింది. ఈ సామాజిక స్ఫూర్తిని భవిష్యత్తులో కూడా ముందుకు తీసుకువెళ్తాం అని అన్నారు.

అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ (AOI) పరిచయం
AOI అనేది దక్షిణ ఆసియా అంతటా అత్యాధునికమైన ప్రెసిషన్ క్యాన్సర్ కేర్ను అందించే అగ్రగామి సంస్థ. ఇది సీమెన్స్ హెల్త్‌నీర్స్ AG నియంత్రణలో ఉన్న వేరియన్ మెడికల్ సిస్టమ్స్ అనుబంధ సంస్థ. 2006లో US నిపుణులచే స్థాపించబడిన AOI, ట్రూబీమ్ లీనియర్ యాక్సిలరేటర్ వంటి ప్రపంచ స్థాయి సాంకేతికత మరియు అంతర్జాతీయ చికిత్సా విధానాలను ఉపయోగించి, భారతదేశంలో అత్యున్నత నాణ్యత గల క్యాన్సర్ సంరక్షణను అందిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com