ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- October 26, 2025
మనామా: బహ్రెయిన్ ఓనర్ ఫోన్ నుంచి నగదు కాజేసిన డొమెస్టిక్ వర్కర్ కు అక్కడి కోర్టు జైలు శిక్ష, జరిమానా విధించింది. ఓనర్ మొబైల్ ఫైనాన్స్ యాప్ లో బ్యాంక్ కార్డ్ పిన్ను ఉపయోగించి ఓ డొమెస్టిక్ వర్కర్ నగదు కాజేసిందని మొదటి హై క్రిమినల్ కోర్టు తీర్పునిచ్చింది. ఒక సంవత్సరం జైలు శిక్ష, 1,000 దినార్ల జరిమానా విధించింద. జైలు శిక్ష పూర్తయ్యాక దేశం నుండి బహిష్కరించాలని ఆదేశించింది.
ఆఫ్రికన్ జాతీయురాలైన నిందితురాలు ఒక మహిళ ఇంట్లో ఉద్యోగం చేస్తోంది. యజమాని ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆమె నగదు బదిలీలను నిర్వహించింది. మరొక మహిళకు డబ్బు పంపింది. బాధితురాలు తన ఫోన్లో 180 దినార్ల బదిలీని గమనించి, తన సోదరిని ఖాతాను తనిఖీ చేయమని కోరింది. మొత్తం 778 దినార్లకు సంబంధించి నాలుగుసార్లు ట్రాన్స్ ఫర్ చేసినట్లు గుర్తించారు.
అయితే, నిందితురాలు తన చేసిన తప్పును ఒప్పుకొని క్షమాపణలు చెప్పింది. చోరీ చేసిన నగదును తిరిగిచ్చేసింది. బహ్రెయిన్‌లో తన రెసిడెన్సీ రెన్యూవల్ కోసం అలా చేసినట్లు కోర్టులో తెలిపింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. నిందితురాలికి జైలుశిక్ష, ఫైన్ విధిస్తూ తీర్పును వెలువరించింది.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్‌లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్‌లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







