ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- October 26, 2025 
            మస్కట్: ఒమన్ లో జాతీయ డిజిటల్ పరివర్తన ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతున్నాయి. మొత్తం 36 ప్రాజెక్టులలో 25 డిజిటల్ కార్యక్రమాలు మరియు ప్రాజెక్టులు 100 శాతం పూర్తియినట్లు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MTCIT) ప్రకటించింది. మిగిలిన 11 ప్రాజెక్టులు పనులు కొనసాగుతున్నాయని, ఇవి 80 శాతం పూర్తి అయినట్లు పేర్కొంది.
ప్రభుత్వ సేవలను పూర్తిగా డిజిటలైజేషన్ చేయడం, ఇ-ప్రభుత్వ సామర్థ్యాన్ని పెంచడం మరియు ఒమన్ విజన్ 2040 లక్ష్యాలకు అనుగుణంగా సేవలను వేగవంతంగా అందిచడానికి వీలవుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
100 శాతం పూర్తయిన ప్రాజెక్టులలో యూనిఫైడ్ ప్రభుత్వ సేవల పోర్టల్ మరియు యూనిఫైడ్ నకల్ (మొబైల్) అప్లికేషన్ ఉన్నాయి. ఇవి బహుళ ప్లాట్‌ఫారమ్‌లను నావిగేట్ చేయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ సేవలకు అనుకూలమైన డిజిటల్ గేట్వేగా పనిచేస్తుందని MTCITలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ మరియు సెక్టోరల్ ఎంపవర్మెంట్ డైరెక్టర్ జనరల్ అబ్దులాజీజ్ బిన్ అబ్దుల్‌రెహ్మాన్ అల్ ఖరౌసి తెలిపారు. ఈ కార్యక్రమాల పూర్తి ఒమన్ డిజిటల్ ప్రభుత్వ ప్రయాణంలో ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తుందన్నారు. ప్రభుత్వ సామర్థ్యాన్ని పెంపొందించడానికి తహావుల్ ప్రోగ్రామ్ నిబద్ధతను ప్రదర్శిస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!
- యూఏఈలో 6నెలల్లో 6 మిలియన్ల VPN యాప్స్ డౌన్లోడ్..!!
- వారంలో 14,039 మందిని బహిష్కరించిన సౌదీ..!!
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్‌లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!







