కబాలి బాక్సాఫీస్ రికార్డ్ ల దుమ్ముదులుపుతోంది..
- July 23, 2016
భారీ అంచనాల మధ్య శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన కబాలి బాక్సాఫీస్ రికార్డ్ ల దుమ్ముదులుపుతోంది. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ లో సంచలనాలను నమోదు చేసిన తలైవా, రిలీజ్ తరువాత కూడా తన హవా కోనసాగిస్తున్నాడు. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో ఈ సినిమాకు థియేటర్లు లభించటంతో కనీవినీ ఎరుగని కలెక్షన్లు సాధ్యమవుతున్నాయి.తమిళనాట 650కి పైగా స్క్రీన్ లో రిలీజ్ అయ్యింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే స్థాయిలో రిలీజ్ అయిన కబాలి భారీ వసూళ్లను సాధిస్తోంది. ఇప్పటికే తొలి మూడు రోజుల టికెట్లు అడ్వాన్స్ బుకింగ్స్ అయిపోయాయి. ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు కబాలి హవా దక్షిణాదిని ఊపేయనుంది. రజనీకి భారీ క్రేజ్ ఉన్న తెలుగు, తమిళ్ లోనే కాదు, కేరళలో కూడా కబాలి భారీగా రిలీజ్ అయ్యింది. దాదాపు 306 థియేటర్లలో రిలీజ్ అయి అక్కడ కూడా రికార్డ్ సృష్టించింది. కబాలి సంచలనాలు దక్షిణాదికే పరిమితమైపోలేదు. ఉత్తరాదిలో కూడా తలైవా హవా చూపిస్తున్నాడు. కేవలం ఈ సినిమా చూడటానికే విదేశీయులు ముంబై చేరుకున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ లలో కలిపి 135 థియేటర్లలో కబాలి సందడి కనిపిస్తుండగా, పంజాబ్ లో 70 థియేటర్లలో కబాలి రిలీజ్ అయ్యింది. ముంబై, కలకత్తా, ఢిల్లీ లాంటి ప్రధాన నగరాల్లో కబాలి మేనియా బాగా కనిపిస్తోంది.ఇప్పటికే తొలి రోజు కలెక్షన్ల రికార్డులను తిరగరాసిన తలైవా.. ముందు ముందు మరిన్ని రికార్డులు సాధించే దిశగా దూసుకుపోతున్నాడు. అయితే సినిమాకు డివైడ్ టాక్ రావటంతో బాహుబలి, భజరంగీబాయిజాన్ లాంటి భారీ రికార్డ్ లకు డోకా లేదన్న వాదన వినిపిస్తోంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







