హ్యాపీబర్త్‌డే చిత్ర గీతాలు....
- July 23, 2016
చెన్నమనేని శ్రీధర్, జ్యోతిసేథ్, సంజన, శ్రవణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం హ్యాపీబర్త్‌డే. పల్లె వీరారెడ్డి దర్శకుడు. మహేష్ కల్లే నిర్మాత. ఈ చిత్ర గీతాలు గురువారం రాత్రి హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ విడుదల చేయగా, జి.సంతోష్‌రెడ్డి సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియోను ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆవిష్కరించారు. తొలి సీడీని తమ్మారెడ్డి భరద్వాజ స్వీకరించారు.ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ కథ, కథనం ఆద్యంతం ఆసక్తికరంగా వుంటుంది. కీలక సన్నివేశాల్ని హైదరాబాద్, వైజాగ్ ప్రాంతాల్లో చిత్రీకరించాం అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ కొన్నేళ్ల క్రితం జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఒక ఇంట్లో ఓ జంటకు ఎదురైన సంఘటనల సమాహారమే ఈ సినిమా. రాత్రి 8 గంటల నుంచి 12 గంటల వరకు మధ్య ఏం జరిగిందనేది ఇందులో ఆసక్తికరం. సంతోష్‌రెడ్డి అందించిన సంగీతం చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది అన్నారు. శ్రీధర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎన్నో చిత్రాల్లో నటించాను. అయితే ఈ సినిమాలో తొలిసారి హీరోగా నటిస్తున్నాను. అద్భుతమైన కథ, కథనాలతో తెరక్కుతున్న చిత్రమిది. అందరికి నచ్చే అంశాలన్నీ ఇందులో వున్నాయి. మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకముంది అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు సంతోష్‌రెడ్డి, బి.గోపాల్, సంజన, కపిల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







