అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత

- October 27, 2025 , by Maagulf
అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో తుఫాను పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. రాష్ట్ర హోంమంత్రి అనిత మాట్లాడుతూ, తుఫాను ప్రభావం ఉండే జిల్లాల్లో ప్రతి ఒక్కదాంట్లో ప్రత్యేక కంట్రోల్ రూములు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలు ఏవైనా అత్యవసర అవసరాలు లేదా సమాచారం కోసం ఈ కంట్రోల్ రూమ్ నంబర్లను సంప్రదించవచ్చని ఆమె సూచించారు. హోంమంత్రి వివరించిన ప్రకారం, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో శాటిలైట్ ఫోన్లు అందుబాటులో ఉంచారు.

అలాగే సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎస్డీఆర్ఎఫ్ (SDRF) బృందాలను అప్రమత్తంగా ఉంచినట్లు తెలిపారు. అదనంగా, ఇరిగేషన్, సివిల్ సప్లైస్, మెడికల్, విద్యుత్ శాఖల సిబ్బందిని కూడా అండగా నిలపాలని సూచనలు ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రజల ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని అనిత స్పష్టం చేశారు. తుఫాను తీవ్రతను బట్టి అవసరమైతే అదనపు బృందాలను పంపిస్తామని కూడా తెలిపారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com