సౌదీ అరేబియాలో స్నాప్‌చాట్ కు యువత ఫిదా..!!

- October 29, 2025 , by Maagulf
సౌదీ అరేబియాలో స్నాప్‌చాట్ కు యువత ఫిదా..!!

రియాద్: సౌదీ అరేబియాలో స్నాప్‌చాట్ కు యువత ఫిదా అవుతున్నారు. డైలీ వందల మంది ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుంటున్నారని స్నాప్‌చాట్ CEO ఇవాన్ స్పీగెల్ తెలిపారు. సౌదీ అరేబియాలో 26 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారని పేర్కొన్నారు. ప్రపంచ సోషల్ మీడియా ల్యాండ్‌స్కేప్‌లో సౌదీ ప్రభావం చూపుతుందని తెలిపారు.

మంగళవారం రియాద్‌లో జరిగిన ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ ఇనిషియేటివ్ (FII9) 9వ ఎడిషన్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సౌదీ రాజధాని రియాద్ ను తాను "ప్రేమించే" ప్రదేశంగా అభివర్ణించాడు.  దానిని తన "రెండవ ఇల్లు" అని పేర్కొన్నాడు.

"రియాద్‌లో ఉండటం చాలా బాగుంది. నాకు చాలా ఇష్టమైన ప్రదేశం, సౌదీ అరేబియాలో మా కమ్యూనిటీ దాదాపు 33 మిలియన్ల జనాభా ఉన్న దేశంలో 26 మిలియన్ల మందికి పెరిగింది" అని స్పీగెల్ అన్నారు.  

స్నాప్‌చాట్ ఒక సాధారణ మెసేజ్ సర్వీస్ గా ప్రారంభమైందని, కానీ అప్పటి నుండి ప్రైవేట్ షేరింగ్ మరియు పబ్లిక్ ఎంటర్‌టైన్‌మెంట్ రెండింటినీ తీర్చే స్టోరీస్, స్పాట్‌లైట్ లా అభివృద్ధి చెందిందని ఆయన వివరించారు. ఇప్పుడు ఏఐతో దూసుకుపోతుందని తెలిపారు.  సౌదీ అరేబియా ప్రపంచవ్యాప్తంగా స్నాప్‌చాట్ అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా ఉందని వెల్లడించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com