ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!

- October 29, 2025 , by Maagulf
ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!

దోహా: ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్ ఇస్తామని ఖతార్ నేషనల్ బ్లడ్ డోనర్ సెంటర్ స్పష్టం చేసింది. అత్యవసర కాల్స్ జారీ అనేది యాదృచ్ఛికం కాదని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు. ఆసుపత్రులు రక్త సరఫరా కొరతను ఎదుర్కోకుండా చూసుకోవడానికి రియల్ టైమ్ అవసరాలకు అనుగుణంగా కాల్స్ ఇస్తుంటామని  హమద్ మెడికల్ కార్పొరేషన్ (HMC) డిపార్ట్‌మెంట్ ఆఫ్ లాబొరేటరీ మెడిసిన్ అండ్ పాథాలజీలో ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అయ్షా అల్ మలికి తెలిపారు.   

ఖతార్‌లో రక్తాన్ని సేకరించి పంపిణీ చేయడానికి బాధ్యత వహించే ఏకైక సంస్థగా, అన్ని ఆసుపత్రులలో కీలకమైన సరఫరా స్థాయిలను నిర్వహిస్తుందని వెల్లడించారు.  ముఖ్యంగా O నెగిటివ్, A నెగిటివ్ మరియు B నెగిటివ్ వంటి బ్లడ్ గ్రూపుల కొరత తరచుగా ఉంటుందన్నారు.

 శస్త్రచికిత్సలు, క్యాన్సర్ చికిత్సలు మరియు దీర్ఘకాలిక రక్త రుగ్మతలతో బాధపడుతున్న వారికి అత్యవసరంగా రక్తం సరఫరా చేయాల్సి ఉంటుందని, అందుకు నిరంతరం రక్తం నిల్వలను నిర్వహించాల్సిన పరిస్థితులు ఉంటాయని డాక్టర్ అల్మాలికి వివరించారు.

ఆరోగ్యవంతులు ప్రతిఒక్కరూ తరచూ రక్త దానం చేయాలని, ఒకసారి చేసిన రక్తదానం ముగ్గురి ప్రాణాలను కాపాడుతుందని, రక్తదానం చేసి జీవితంలో హీరోలుగా మారాలని డాక్టర్ అల్మాలికి పిలుపునిచ్చారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com