కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- October 29, 2025
కువైట్: కువైట్ లో వాహనాల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది. దేశంలో కార్లు మరియు మోటార్ సైకిళ్ల సంఖ్య 2024 చివరి నాటికి 2.609 మిలియన్లకు చేరుకున్నాయి. వీటి సంఖ్య 2023లో 2.522 మిలియన్లుగా ఉండగా, కొత్తగా 86,388 వాహనాలు రోడ్ల మీదకు వచ్చాయని కేంద్ర గణాంక బ్యూరో తాజా నివేదిక వెల్లడించింది.
అన్ని వాహనాలలో 80.65% వాటాను ప్రైవేట్ కార్లు కలిగి ఉన్నాయి. వాటి సంఖ్య 2024లో 2.104 మిలియన్లకు పెరిగింది. ఇది మునుపటి సంవత్సరం 2.028 మిలియన్లు మాత్రమే. ప్రైవేట్ మోటార్ సైకిళ్ల సంఖ్య కూడా స్వల్పంగా పెరిగి 2023లో 47,623 నుండి 49,591కి చేరుకుంది.
2024 చివరి నాటికి కువైట్‌లో 535 లైసెన్స్ పొందిన టాక్సీలు, 4,938 ఆన్-డిమాండ్ టాక్సీలు, 9,342 రోమింగ్ టాక్సీలు, 322,131 ప్రైవేట్ రవాణా వాహనాలు మరియు 38,293 ప్రజా రవాణా వాహనాలు ఉన్నాయి. మొత్తం 92,976 మంది కొత్తగా డ్రైవింగ్ లైసెన్సులు పొందారని నివేదిక వెల్లడించింది.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







