బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- October 29, 2025
మస్కట్: బర్కా విలాయత్ బీచ్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. సౌత్ అల్ బటినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది. పెద్ద మొత్తంలో గంజాయిని అక్రమంగా రవాణా చేసే ప్రయత్నాలను అడ్డుకుంది. బర్కా విలాయత్ బీచ్‌లో మాదకద్రవ్యాలను స్వీకరిస్తున్న ఇద్దరు అరబ్ జాతీయులను అరెస్టు చేసింది.
అనంతరం కోస్ట్ గార్డ్ పోలీసులు స్మగ్లర్ల పడవను వెంబడించి, దానిని స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న ఆసియా జాతీయతకు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశాయి.
అలాగే, షినాస్‌లోని విలాయత్‌లో వరుస చోరీలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు నార్త్ అల్ బటినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ వెల్లడించింది.
తాజా వార్తలు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!
- సౌదీ అరేబియాలో స్నాప్చాట్ కు యువత ఫిదా..!!
- స్నేహితులు మోసం..వేదన తట్టుకోలేక డాక్టర్ ఆత్మహత్య
- వరద బాధితులకు ఉచితoగా నిత్యావసర సరుకులు: సీఎం చంద్రబాబు







