బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- October 29, 2025
మనామా: బహ్రెయిన్ లోని హమాలాలోని బ్లాక్ 1012లోని నివాసితుల పోరాటం ఫలించింది. వారి ఇళ్లకు పైపుల ద్వారా నీటిని అనుసంధానించే ప్రణాళికను పార్లమెంటు నిన్న అత్యవసరంగా ఆమోదించింది. పిల్లలు మరియు వృద్ధులు ఉన్న ఇళ్లకు ప్రాధాన్యతనిస్తూ వీలైనంత త్వరగా బ్లాక్‌ను మెయిన్‌లకు తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
అక్కడ ఉండే నివాసితులకు పబ్లిక్ వాటర్ సదుపాయం లేదు. అయితే ఒక కిలోమీటరు దూరంలో వాటర్, పవర్, మురుగునీటి వ్యవస్థలు ఉన్నాయి. దాంతో అక్కడి నివాసితులు వాటర్ కోసం ప్రైవేట్ సంస్థలను ఆశ్రయించేవారు. దానికి వారు ఎక్కువ మొత్తం ఖర్చుచేయాల్సి వచ్చేది.
వీరు ఎదుర్కొంటున్న సమస్యను ఎంపీలు డాక్టర్ మునీర్ సెరూర్, ఖలీద్ బువానాక్, లుల్వా అల్ రుమైహి, జలాల్ కధేమ్ మరియు మొహమ్మద్ అల్ అహ్మద్ పార్లమెంట్ లో ప్రస్తావించడంతోపాటు, వారి ఇళ్లకు అత్యవసరంగా నీటి సరఫరా చేయాలని కోరారు. దీంతో స్పందించిన పార్లమెంట్ యుద్ధ ప్రాతిపదికన ఆయా ఇళ్లను వాటర్ నెట్ వర్క్ కు అనుసంధానించాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!
- సౌదీ అరేబియాలో స్నాప్చాట్ కు యువత ఫిదా..!!
- స్నేహితులు మోసం..వేదన తట్టుకోలేక డాక్టర్ ఆత్మహత్య







