పదేళ్లకు రవీనా టాండన్ తెలుగు తెరపై రీఎంట్రీ!
- October 30, 2025
తెలుగు సినిమా ప్రేక్షకులకు రవీనా టాండన్ పేరు కొత్తది కాదు. 90వ దశకంలో ఆమె అందం, అభినయం, చరిష్మాతో యువతను ఆకట్టుకున్న స్టార్ హీరోయిన్. హిందీతో పాటు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో కూడా స్థానం సంపాదించింది. నందమూరి బాలకృష్ణతో “బంగారు బుల్లోడు”, అక్కినేని నాగార్జునతో “ఆకాశవీధిలో” చిత్రాల్లో నటించి రవీనా టాండన్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాలు అప్పట్లో బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచాయి.
అయితే తెలుగు సినిమాల్లో ఎక్కువగా కనిపించకుండా బాలీవుడ్ వైపు మళ్లిన ఆమె, తర్వాత అనేక హిందీ చిత్రాల్లో టాప్ హీరోల సరసన నటిస్తూ స్టార్‌గా ఎదిగింది. ఆ తర్వాత కొంత విరామం తీసుకుని 2014లో మోహన్ బాబు జోడిగా “పాండవులు పాండవులు తుమ్మెద” చిత్రంలో కనిపించింది. తాజాగా కేజీఎఫ్ చాప్టర్ 2లో ఆమె పోషించిన పాత్రతో మళ్లీ క్రేజ్ తెచ్చుకుంది.
ఇప్పుడు రవీనా టాండన్ మరోసారి తెలుగులోకి రీఎంట్రీ ఇస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న “సూర్య 46” చిత్రంలో ఆమె కీలక పాత్రలో నటించనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రవీనా శక్తివంతమైన పాత్రలో కనిపించనుందనే సమాచారం వినిపిస్తోంది. దీంతో ఆమె అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. దీని ద్వారా రవీనా టాండన్ మరోసారి దక్షిణాదిలో తన ప్రభావాన్ని చూపనుందనే అంచనాలు ఉన్నాయి.
అదే సమయంలో, “ప్రేమలు” ఫేమ్ మమితా బైజు ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. సూర్య-వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజా వార్తలు
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు
- ఆర్థిక స్వేచ్ఛ..గల్ఫ్ లో అగ్రస్థానంలో బహ్రెయిన్..!!







